Karthika Deepam 2 March Today Episode : మీ ఇంట్లో పెంచుకుంటున్న బాబును నాకిచ్చేయని కార్తీక్ తో అన్న మోనిత.. మరోవైపు మోనితకు భారీ షాకిచ్చిన దీప.. ఇంతలో మరో ట్విస్ట్

Advertisement
Advertisement

Karthika Deepam 2 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 1289 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, మోనిత.. ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్తారు. ఆనంద్ పుట్టిన సమయంలో పుట్టిన ఇతర పిల్లల డేటాను తీసుకుంటుంది మోనిత. దాన్ని కార్తీక్ కు చూపిస్తుంది. కార్తీక్ ఆ ఫైల్ ను చూస్తుంటాడు. అందులో శ్రీవల్లి, కోటేశ్ లిస్ట్ ను తీసేశాను అని మనసులో అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ మీద పడేందుకు ప్రయత్నిస్తుంది మోనిత. కింద పడబోతుంది కానీ.. కార్తీక్ తనను పట్టుకోడు. ఏంటి కార్తీక్ నువ్వు. కింద పడబోతున్నా పట్టుకోవా. నువ్వు ఏం చేసినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటుంది మోనిత. నువ్వు కాదన్నా.. నేను ఎప్పుడూ నీదాన్నే అంటుంది మోనిత.

Advertisement

karthika deepam 2 march 2022 full episode

నీ ఆటోబయోగ్రఫీ వినేందుకు నేను ఇక్కడికి రాలేదు అంటాడు కార్తీక్. మరోవైపు పిల్లలు.. ఆనంద్ కు బాగా దగ్గరవుతారు. అమ్మ నువ్వెందుకు తమ్ముడిని ఎక్కువగా ఎత్తుకోవడం లేదు. అసలు తమ్ముడిని పట్టించుకోవడం లేదు. నేను తమ్ముడిని చూసుకున్నా కసురుకుంటున్నావు అని అంటుంది హిమ. నేను తమ్ముడిని పట్టుకొని ఆడిస్తుంటే కూడా నీకు కోపం వస్తోంది అంటుంది హిమ. ఎందుకమ్మా అలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తుంది హిమ. దీంతో తనకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు దీపకు. ఆనంద్ అంటే హిమకు ఎక్కడ లేని ప్రేమ. అందుకే మనం ఒక్క మాట అన్నా పడేలా లేదు. ఇక నావల్ల కాదు అత్తయ్య. ఈ విషయం డాక్టర్ బాబుకు చెప్పేస్తాను అంటుంది దీప.

Advertisement

తర్వాత కార్తీక్.. మోనితను తన ఇంటి వద్ద దింపేస్తాడు. నువ్వు నన్ను వద్దు అనుకున్నా కాలం మనల్ని కలుపుతుంది. నువ్వు మాట మీద నిలబడతావని నాకు తెలుసు. కానీ.. నాకు ఒక డౌట్ వచ్చింది. ఒకవేళ మన బిడ్డ దొరకకపోతే ఎలా అని ప్రశ్నిస్తుంది మోనిత.

Karthika Deepam 2 March Today Episode : ఆనంద్ ను క్షణం కూడా వదలని హిమ

దీంతో ఏంటి.. అంటాడు. అంటే.. మన బిడ్డ దొరక్కపోతే ఎలా అంటున్నాను కార్తీక్ అంటుంది. నువ్వు వెతుకుతున్నావు కానీ.. ఒకవేళ దొరక్కపోతే అప్పుడు ఏం చేస్తావు అంటుంది మోనిత. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. మీ ఇంట్లో పెంచుకుంటున్న బాబును నాకు ఇచ్చేయండి అంటుంది మోనిత.

నేను కూల్ గానే మాట్లాడుతున్నాను అంటుంది మోనిత. నువ్వు అసలు ఎందుకు అరుస్తున్నావు. వాడిలో మన బాబును చూసుకుంటాను అంటున్నాను అంటుంది మోనిత. దీంతో ఇంకోసారి ఆమాట అనకు. వాడు మా ప్రాణం.. అంటాడు కార్తీక్.

ప్రాణమా అంటుంది. దీంతో అవును అంటాడు. వాడిని వదిలి మా ఇంట్లో వాళ్లు ఒక్క క్షణం కూడా ఉండలేరు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు అంటాడు కార్తీక్. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు కార్తీక్ కు నిజం చెప్పాలా వద్దా అని అనుకుంటుంది దీప. వద్దు దీప.. ఇప్పుడు  కార్తీక్ కు నిజం చెబితే చాలా సమస్యలు వస్తాయి అంటుంది సౌందర్య.

పిల్లలు ఆనంద్ పై ప్రేమ పెంచుకుంటున్నారు అంటుంది దీప. ఇంతలో కార్తీక్ వస్తాడు. ఆ బిడ్డ వెతకడం కోసం వెళ్లి వచ్చా. ఆ బిడ్డను వెతికిస్తే ఇక మోనిత మన జోలికి రానని చెప్పింది. అందుకే.. నాకు ఇష్టం లేకపోయినా నేను వెతుకుతున్నాను అంటాడు కార్తీక్.

ఆ బిడ్డ దొరక్కపోతే మన ఆనంద్ ను ఇచ్చేయమంటోంది మోనిత. మన ఆనంద్ ను ఎలా ఇస్తాం. ఆనంద్ మన వాడు. వాడిని ఎవ్వరికీ ఇవ్వం. ఇవ్వలేను అంటాడు కార్తీక్. అదేంటో.. ఆనంద్ ను చూడగానే మనసులో ఉన్న బరువు అంతా దిగిపోయినట్టుగా అనిపిస్తుంది అంటాడు కార్తీక్.

వాడిని కాసేపు ఎత్తుకుంటే నాలో ఏదో తెలియని ఎనర్జీ వచ్చినట్టుగా ఉంటుంది అంటాడు కార్తీక్. దీప.. మోనితకు ఆనంద్ విషయంలో గట్టిగా సమాధానం చెప్పాలంటే.. మన కుటుంబంలో ఒకడిగా ఆనంద్ ను అన్నింటిలో యాడ్ చేయాలి. అన్ని ప్రభుత్వ కార్డులలో ఆనంద్ పేరును జత చేద్దాం అంటాడు కార్తీక్.

దీంతో ఇంత అర్జెంట్ గా ఎందుకు కార్తీక్ అంటుంది సౌందర్య. మరోవైపు మోనిత.. బస్తీలో ఉన్న వాళ్లందరినీ పిలిచి చీరలు కానుకగా ఇస్తుంది. ఈరోజు మనందరికీ శుభదినం. పండుగలకు చీరలు పంచడం కొందరికి అలవాటు. నేను కూడా ఒక పండక్కే చీరలు పంచబోతున్నాను అంటుంది మోనిత.

అసలు ఈరోజు ఏం పండగ అనుకుంటున్నారా? అని అంటుంది మోనిత. ఈరోజు నా కార్తీక్.. నా ఇంటికొచ్చాడు. నా ఇంట్లో కాలు పెట్టాడు. అంతకంటే గొప్ప పండుగ ఏముంటుంది చెప్పండి.. అంటుంది మోనిత. మోనిత మొగుడేంటి అనే డౌట్స్ వచ్చాయా. వాటికి సమాధానాలు చెబుతాను.. దీపక్క అభిమానులారా.. కార్తీక్ దీపకే కాదు.. నాకూ మొగుడే అంటుంది మోనిత.

ఇంతలో దీప వచ్చి మోనిత చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

3 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

5 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

6 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

7 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

8 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

9 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

10 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

11 hours ago

This website uses cookies.