Pawan Kalyan : శంకర్ తో పవన్ సినిమా ఎలా మిస్ అయ్యింది.. పీక్స్ లో ఉన్నా కూడా పవర్ స్టార్ ఎందుకు కాదన్నాడు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : శంకర్ తో పవన్ సినిమా ఎలా మిస్ అయ్యింది.. పీక్స్ లో ఉన్నా కూడా పవర్ స్టార్ ఎందుకు కాదన్నాడు..?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొన్నటిదాకా బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా ఆయన తన మార్క్ చూపించడం మొదలుపెట్టారు. పవన్ తో చేసే డైరెక్టర్ ఎవరైనా సరే అతనికి సూపర్ క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటి పవన్ తో సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా మిస్ అయిందని ఎంతమందికి తెలుసు. అవును అది నిజమే శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : శంకర్ తో పవన్ సినిమా ఎలా మిస్ అయ్యింది.. పీక్స్ లో ఉన్నా కూడా పవర్ స్టార్ ఎందుకు కాదన్నాడు..?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొన్నటిదాకా బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా ఆయన తన మార్క్ చూపించడం మొదలుపెట్టారు. పవన్ తో చేసే డైరెక్టర్ ఎవరైనా సరే అతనికి సూపర్ క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటి పవన్ తో సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా మిస్ అయిందని ఎంతమందికి తెలుసు. అవును అది నిజమే శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సినిమా చేయాల్సి ఉన్నా కూడా మిస్ అయింది.కామినేషన్ సెట్ అవ్వకపోవటానికి కారణం ఎవరో కాదు పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. సౌత్ లో స్టార్ డైరెక్టర్గా శంకర్ పానంటే లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నారు ఆయన సినిమాలన్నీ సామాజిక అంశాలతో నిండి ఉంటాయి. అలాంటి డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా పడితే నెక్స్ట్ లెవెల్ లో రిజల్ట్ ఉండేది. కానీ ఆ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లకుండానే క్యాన్సిల్ చేశాడట పవన్ కళ్యాణ్.

Pawan Kalyan నిజ జీవితంలో చేయాలని..

పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా తెలిసినవారు ఆయన ఎంత నిజాయితీపరుడు అన్నది చెప్తుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తానంటే ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ శంకర్ సినిమా చేయకపోవడానికి గల కారణాలు బయటికి వచ్చాయి. సినిమాల్లో హీరోగా అందరికీ మంచి చేయడం కాదు నిజ జీవితంలో చేయాలనే ఉద్దేశంతో శంకర్ సినిమా కాదనుకున్నారట పవన్ కళ్యాణ్.

Pawan Kalyan శంకర్ తో పవన్ సినిమా ఎలా మిస్ అయ్యింది పీక్స్ లో ఉన్నా కూడా పవర్ స్టార్ ఎందుకు కాదన్నాడు

Pawan Kalyan : శంకర్ తో పవన్ సినిమా ఎలా మిస్ అయ్యింది.. పీక్స్ లో ఉన్నా కూడా పవర్ స్టార్ ఎందుకు కాదన్నాడు..?

శంకర్ సినిమాలో హీరోలందరూ ఎంతో నిజాయితీపరులుగా కనిపిస్తారు నన్ను తీసిన సినిమాలో ప్రతి హీరో కూడా సామాజిక స్పృహతో దేశ భక్తితో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోరుకుంటారు. అయితే అది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి చేయాలనే అనుకున్నాడు. అందుకే జనసేన అనే పార్టీ పెట్టి దాదాపు పది సంవత్సరాలుగా కష్టపడి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా తన సేవలను అందిస్తున్నాడు. అయితే శంకర్ తో పవన్ సినిమా మిస్ అయింది అని తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం చాలా అప్సెట్ లో ఉన్నారు. ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది