Pallavi Prashanth : పేద రైతుల‌కి సాయం చేయ‌కుండా ఫుల్‌గా జ‌ల్సాలు చేస్తున్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్.. తాజాగా ఆ పార్టీలో ర‌చ్చ‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pallavi Prashanth : పేద రైతుల‌కి సాయం చేయ‌కుండా ఫుల్‌గా జ‌ల్సాలు చేస్తున్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్.. తాజాగా ఆ పార్టీలో ర‌చ్చ‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Pallavi Prashanth : పేద రైతుల‌కి సాయం చేయ‌కుండా ఫుల్‌గా జ‌ల్సాలు చేస్తున్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్.. తాజాగా ఆ పార్టీలో ర‌చ్చ‌..!

Pallavi Prashanth : రైతు బిడ్డ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బిగ్ బాస్ సీజ‌న్ 7 విన్న‌ర్‌గా నిలిచిన మ‌నోడికి మంచి క్రేజ్ ద‌క్కింది. బిగ్ బాస్ హౌస్లో తన ప్రవర్తన, ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు. హౌస్ నుండి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ ప్రవర్తన మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. సక్సెస్ కిక్ లో పోలీసుల ఆదేశాలు ఖాతరు చేయకుండా విజయోత్సవ ర్యాలీ చేసి జైలుపాలు అయ్యాడు. ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్‌ అయిన తర్వాత ఇచ్చిన మాట గుర్తుందా? “బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచుతాను.. నాకు వచ్చిన రూ 35 లక్షల్లో నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను. ప్రతి రూపాయి రైతులకే పంచేస్తా” అంటూ స్టేజ్ మీద ప్రశాంత్ మాట ఇచ్చాడు.

Pallavi Prashanth ప్ర‌శాంత్ తీరు బాగోలేదు..

ఇచ్చిన మాట ప్రకారం రైతులకి డబ్బులు ఇవ్వడం లేదని చాలా మంది నెటిజన్లు ప్రశాంత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు కూడా పెట్టారు . బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి ఏడు నెలలు అవుతుంది. ఒక్క లక్ష రూపాయలు మాత్రమే పల్లవి ప్రశాంత్ దానం చేశాడు.మొదటి సహాయం చేసిన నెలలు గడిచిపోగా మరొక పేద రైతును అతడు ఆదుకుంది లేదు. దీంతో పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ విషయంలో మాట తప్పాడు అని ఆయ‌నని దారుణంగా విమ‌ర్శిస్తున్నారు.. ఇక డబ్బులు దానం చేసే సూచనలు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ వ్యవసాయ పనులు చేయడం కూడా తగ్గించాడు. సోషల్ మీడియాలో వ్యవసాయం చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తున్నా అవి కూడా ప్ర‌చారం కోస‌మే.

Pallavi Prashanth పేద రైతుల‌కి సాయం చేయ‌కుండా ఫుల్‌గా జ‌ల్సాలు చేస్తున్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ తాజాగా ఆ పార్టీలో ర‌చ్చ‌

Pallavi Prashanth : పేద రైతుల‌కి సాయం చేయ‌కుండా ఫుల్‌గా జ‌ల్సాలు చేస్తున్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్.. తాజాగా ఆ పార్టీలో ర‌చ్చ‌..!

సోషల్ మీడియా ఆదాయం, ఇతర ప్రమోషన్స్ వలన వచ్చే సంపాదనతో హ్యాపీగా బ్రతికేస్తున్నాడట. అయితే పల్లవి ప్రశాంత్ లుక్ మార్చేసి కొత్త లుక్ లో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కొత్త లుక్ లో పల్లవి ప్రశాంత్ బాగున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరైన శుభశ్రీ రాయగురు బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. ఈ వేడుకలో పల్లవి ప్రశాంత్ లుక్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. టోర్న్ జీన్స్, హుడీ జాకెట్ ధరించి అల్ట్రా మోడ్రన్ గా తయారయ్యాడు. రైతుబిడ్డ ట్రాన్స్ఫర్మేషన్ చూసి జనాల మైండ్ బ్లాక్ అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది