
pawan kalyan to be great person says hyper aadi
Hyper Aadi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అందరికి ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పవన్‌ని సామాన్యులే కాదు సెలబ్స్ సైతం చాలా ఇష్టపడుతుంటారు. అందులో హైపర్ ఆది ఒకరు. ఆయన పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ మీద ఈగ వాలినా.. సహించని మనస్తత్వంతో ఈయన మెగాభిమానులకు చేరువ అయ్యాడు. తాజాగా ఇతను ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు పవన్ కళ్యాణ్‌తో పాటు తన రాజకీయ అరంగేట్రంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్‌ను తాను ఎప్పటికీ అభిమానిస్తునే ఉంటానని.. ఆయనంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు కోసం తాను చిన్న వర్క్ చేస్తున్నానని చెప్పిన ఆది.. పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా పనుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఇంటికి నాలుగు రోజులు వెళ్లి కలిశా. ఆయన ఎంతో గొప్ప మనిషో అని ఆ టైమ్‌లో మరింత తెలిసింది. ఆయన ఎప్పుడు ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచిస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారికి డబ్బు అంటే ఆసక్తి లేదు. ఆయన ఓ సినిమా చేస్తే వచ్చే రూ.30 కోట్లు నుంచి రూ.50 కోట్ల డబ్బును కౌలు రైతులకు పంచిపెడుతున్నారు.
pawan kalyan to be great person says hyper aadi
అందరి మంచి కోరుకునే వ్యక్తి ఆయన. ఆయనకు మంచి జరిగితే అందరికీ సంతోషమే కదా అని చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా..? అని యాంకర్ అడగ్గా.. అలాంటిది ఏమీ లేదంటూ ఆది క్లారిటీ ఇచ్చాడు. కాగా.. పవన్ కళ్యాణ్ అంటే హైపర్ ఆదికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తన ఇష్టాన్ని అతను చాలాసార్లు బయటపెట్టాడు. జబర్దస్త్ షోలో పంచ్‌లతో ఎంతో ఫేమస్ అయిన ఆది.. హరిహరివీర మల్లు మూవీలో నటిస్తున్నాడా..? లేదా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హెల్ప్ చేస్తున్నాడా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
This website uses cookies.