Hyper Aadi : పవన్ కళ్యాణ్ గురించి హైపర్ ఆది అలా అనేశాడేంటి.. మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా!
Hyper Aadi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అందరికి ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పవన్‌ని సామాన్యులే కాదు సెలబ్స్ సైతం చాలా ఇష్టపడుతుంటారు. అందులో హైపర్ ఆది ఒకరు. ఆయన పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ మీద ఈగ వాలినా.. సహించని మనస్తత్వంతో ఈయన మెగాభిమానులకు చేరువ అయ్యాడు. తాజాగా ఇతను ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు పవన్ కళ్యాణ్‌తో పాటు తన రాజకీయ అరంగేట్రంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్‌ను తాను ఎప్పటికీ అభిమానిస్తునే ఉంటానని.. ఆయనంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు కోసం తాను చిన్న వర్క్ చేస్తున్నానని చెప్పిన ఆది.. పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా పనుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఇంటికి నాలుగు రోజులు వెళ్లి కలిశా. ఆయన ఎంతో గొప్ప మనిషో అని ఆ టైమ్‌లో మరింత తెలిసింది. ఆయన ఎప్పుడు ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచిస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారికి డబ్బు అంటే ఆసక్తి లేదు. ఆయన ఓ సినిమా చేస్తే వచ్చే రూ.30 కోట్లు నుంచి రూ.50 కోట్ల డబ్బును కౌలు రైతులకు పంచిపెడుతున్నారు.

pawan kalyan to be great person says hyper aadi
Hyper Aadi : క్రేజీ కామెంట్స్…
అందరి మంచి కోరుకునే వ్యక్తి ఆయన. ఆయనకు మంచి జరిగితే అందరికీ సంతోషమే కదా అని చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా..? అని యాంకర్ అడగ్గా.. అలాంటిది ఏమీ లేదంటూ ఆది క్లారిటీ ఇచ్చాడు. కాగా.. పవన్ కళ్యాణ్ అంటే హైపర్ ఆదికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తన ఇష్టాన్ని అతను చాలాసార్లు బయటపెట్టాడు. జబర్దస్త్ షోలో పంచ్‌లతో ఎంతో ఫేమస్ అయిన ఆది.. హరిహరివీర మల్లు మూవీలో నటిస్తున్నాడా..? లేదా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హెల్ప్ చేస్తున్నాడా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.