Vakeel Saab Teaser : అమితాబ్, అజిత్ లని కనిపించకుండా చేసిన పవన్ కళ్యాణ్ ..!
వకీల్ సాబ్ సినిమా నుంచి టీజర్ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది మే 15 న రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కరోనా కారణంగా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. అయితే ఈ సినిమా మీద ఎప్పటికప్పుడు మేకర్స్ భారీ స్థాయిలో అంచనాలు పెరిగేలా చేశారు. ఇక వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తుండటం తో దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో అంచనాలు నెలకొన్నాయి.

Vakeel Saab Teaser : అమితాబ్, అజిత్ లని కనిపించకుండా చేసిన పవన్ కళ్యాణ్ ..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పకుడిగా వ్యవహరించాడు. యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి కీలక పాత్రల్లో నటించారు. సీనియర్ నరేష్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
వకీల్ సాబ్ టీజర్ లో హైలెట్స్ ఇవే ..!
బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాని కోలీవుడ్ లో అజిత్ కుమార్ నేర్కొండ పార్వై గా చేశాడు. హిందీ, తమిళంలో 100 కోట్ల కి పైగానే వసూళ్ళు సాధించాయి. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మీదే అందరి దృష్ఠి ఉంది. అందుకు తగ్గట్టుగానే వకీల్ సాబ్ టీజర్ ఉండటం విశేషం. అమితాబ్ నటించిన బాలీవుడ్ పింక్ లో ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా ఫైట్స్ లేకుండా సీన్స్ ఉండగా .. తమిళ వెర్షన్ లో అజిత్ కి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ఫైట్స్ ని జోడించారు. ఇక మన తెలుగు వెర్షన్ లో పవన్ కళ్యాణ్ కి జంటగా శృతి హాసన్ పాత్రని యాడ్ చేయడం పవర్ స్టార్ నుంచి అభిమానులు ఏం కావాలనుకుంటున్నారో అంశాలని కలిపి తెరకెక్కించారు. కోర్టులో వాదించడము తెలుసు కోటు తీసి కొట్టడమూ తెలుసు అన్న డైలాగ్ టీజర్ లో పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించింది.