Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్‌తో పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్.. ఏ మూవీకి రీమేకో తెలుసా?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరో వైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆయన రీమేక్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలే పూర్తవుతాయా అనే డిస్కషన్స్ జరుగుతుండగా ఇప్పుడు మరో కొత్త సినిమాకూ ఓకే చెప్పాడనే వార్తలు వచ్చాయి. అయితే పవన్ సోలోగా కన్నా మల్టీ స్టారర్ రీమేక్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపుతుండడం విశేషం.
ఇప్పటికే వెంకటేశ్‌తో ‘గోపాల గోపాల’, రానాతో ‘భీమ్లా నాయక్’ చేశారు. ఇప్పుడు తన ఫ్యామిలీలో హీరో, మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి తెర పంచుకునేందుకు సిద్ధమయ్యారు! ఈ విషయం దాదాపు ఖరారైంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం త్వరలో రానుంది.తమిళంలో గతేడాది ఓటీటీలో విడుదలైన సినిమా ‘వినోదయ సితమ్’. సముద్రఖని దర్శకత్వం వహించడం సహా కీలకపాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు తెలుగులోనూ ఆయనే డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 13న ఈ చిత్రం జీ-5 ఓటీటీలో తెలుగు..తమిళ్ లో రిలీజ్ అయింది.పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన ‘భీమ్లా నాయక్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Pawan Kalyan with Sai Dharam Tej Multi Starrer Movie
Pawan Kalyan : రీమేక్‌లపై ఆసక్తి..
కరోనా వలన ఈ సినిమా వాయిదా పడుతుంది. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌తో పవర్‌స్టార్ బిజీగా ఉన్నారు. దీని తర్వాత ‘భవదీయుడు భగత్‌సింగ్’ చేస్తారు. మరోవైపు సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం ఓ మిస్టరీ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తుండగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పవన్ స్క్రిప్ట్ ల విషయంలో కేర్ ఫుల్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. వయసుకు తగ్గ పాత్రలే ఎంచుకుంటున్నారు. కమర్శియల్ కంటెంట్ కి దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. మరి వీటన్నింటిపైనా క్లారిటీ రావాలంటే కొంచెం సమయం పడుతుంది.