Khushi Movie : పబ్లిక్ టాక్ లో “ఖుషి” సినిమా పై పవన్ కళ్యాణ్ అభిమాని బూతులు.. వీడియో !!

Authored By Breaking News | The Telugu News | Published on: September 2, 2023, 12:10 pm

Khushi Movie  : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ “ఖుషి”. 2001వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే సినిమా టైటిల్ ని పెట్టుకుని విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా సినిమా చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబర్ మొదటి తారీకు విడుదల కావడం జరిగింది. అయితే ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమాని మొదటి రోజు పబ్లిక్ టాక్ లో బూతులు తిట్టారు.

తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ పెట్టుకుని విజయ్ దేవరకొండ తీసిన “ఖుషి” ఏమాత్రం బాగోలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ “ఖుషి”కి విజయ్ దేవరకొండ నటించిన “ఖుషీ” కీ అసలు సంబంధం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో ఫీల్… విజయ్ దేవరకొండ నటించిన ఈ “ఖుషి”లో లేదని స్పష్టం చేశారు. ఫస్టాఫ్ బాగానే ఉన్నా.. సెకండాఫ్ రాడ్ అని.. అనవసరమైన సన్నివేశాలు పెట్టినట్లు పవన్ అభిమాని మండిపడ్డారు.

pawan kalyans fan khushi movie in public talk

pawan kalyans fan khushi movie in public talk

“లైగర్” వంటి ఫ్లాప్ వచ్చిన తర్వాత సినిమాలు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇటువంటి స్టోరీ విజయ్ దేవరకొండ ఎంచుకోవడం దారుణమని అన్నారు. క్లైమాక్స్ లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. పిల్లలు మరియు తల్లిదండ్రుల మధ్య సెంటిమెంట్ సీన్స్ డైరెక్టర్ చాలా అద్భుతంగా చిత్రీకరించడం ఫస్ట్ ఆఫ్ అంతా బాగానే ఉన్న సెకండ్ హాఫ్ అంతగా లేదని పవన్ అభిమాని “ఖుషి” చూసి పబ్లిక్ టాక్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp