Bigg Boss OTT Telugu : బుల్లితెర బిగ్ రియాలీటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ ఫైట్ ఉత్కంఠగా మారింది. 17 మంది కంటెస్టెంట్స్‌తో 12 వారాలుగా సాగుతున్న ఈ ఆట చివరి అంకానికి చేరుకుంది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్స్‌తో హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. మిత్రా శర్మ, అనీల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి ఈ ఏడుగురు బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. ఈసారి చివరి వారంలో కూడా ఏడుగురు కంటెస్టెంట్స్ హౌస్‌లోనే ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఈ సీజన్‌లో లేనేలేదు. శనివారం (మే 21) సాయత్రం బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాబోతుంది.
ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ పోల్ స్టార్ట్ కాగా.. బుధవారంతో ముగిసింది ప్రతిసారి దాదాపు వారం రోజులు పాటు ఓటింగ్ లైన్స్ ఓపెన్‌లో ఉండేవి. కానీ విన్నర్ ఎవరో తేల్చే ఓటింగ్ లైన్స్ మాత్రం కేవలం నాలుగు రోజులకే పరిమితం చేశారు. అయినప్పటికీ కూడా ఓట్లు కోట్లు దాటుతున్నాయి. ప్రతి సీజన్‌లో ఆడియన్స్ నుంచి కోట్లాది ఓట్లు వస్తుండగా.. నాన్ స్టాప్ ఓటింగ్‌కి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ ప్రకారం ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారు..? ఎవరు ఏ స్థానంలో ఉన్నారు? విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందనేది ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలో చాలా మంది తమ ఫేవరేట్స్ కంటెస్టెంట్స్‌ని సపోర్ట్ చేస్తున్నారు.
తాజాగా నటి పాయల్ రాజ్‌పుత్ కూడా సోషల్ మీడియా వేదికగా బిందు మాధవికి తన మద్దతు తెలిపింది. బిందు మాధవికి ఓటు వేసి గెలిపించాలని తన ఫాలోవర్స్‌ను కోరింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో బిందు ఫొటోను షేర్ చేస్తూ.. ‘నువ్వు టైటిల్ గెలవడానికి అర్హురాలివి’ అంటూ బిందుకు సపోర్ట్ చేసింది పాయల్. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఓ అమ్మాయి టైటిల్ గెలవలేదు. అనీల్ రాథోడ్‌కి అందరికంటే తక్కువ ఓట్లు పడుతుండటంతో అతను ఏడో స్థానంలో ఉన్నాడు. అతని తరువాత మిత్రా శర్మకి తక్కువ ఓట్లు పడుతున్నాయి.. ఆమె ఆరో స్థానంలో ఉంది. ఇక టాప్ 5 విషయానికి వస్తే.. బాబా భాస్కర్ ఐదో స్థానంలో ఉంటే.. అరియానా గ్లోరి నాలుగో స్థానంలో ఉంది. యాంకర్ శివ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టైటిల్ కోసం బిందు మాధవి, అఖిల్ సార్ధక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.