సుడిగాలి సుధీర్‌కు ఎదురు దెబ్బ.. పోలీసుల జోక్యంతో సమస్యకు చెక్

Authored By Admin | The Telugu News | Published on: December 30, 2020, 7:00 pm

సుడిగాలి సుధీర్‌కు తాజాగా ఓ ఎదురు దెబ్బ తగిలింది. జన సమూహంలో షూటింగ్ చేయడం ప్రస్తుతం ఎంత ప్రమాదం అందరికీ తెలిసిందే. పైగా ఊర్లో లేదా కాలనీలో సినిమా షూటింగ్‌లు జరపడం కూడా ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. తాజాగా హైద్రాబాద్‌లోని ఓ కాలనీలో సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్‌లో గొడవలు జరిగాయి. అక్కడి స్థానికులు వచ్చి షూటింగ్‌ను అడ్డుకున్నారు.

People protest At Sudigali Sudheer Movie Shooting

People protest At Sudigali Sudheer Movie Shooting

సుడిగాలి సుధీర్ హీరోగా సాంబ‌శివ ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ను జనం అడ్డుకున్నారు. హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని మ‌ల‌క్‌పేట పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో బీ బ్లాక్ కాల‌నీలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. సినిమా షూటింగ్‌ను ఆ కాల‌నీలో చేప‌ట్టారు. షూటింగ్ స్టార్ట్ అయిన కాసేప‌టికే స్థానికులు అక్క‌డికి చేరుకున్నారు. కరోనా తాండవం చేస్తోన్న సమయంలో ఇలా తమ కాలనీలో షూటింగ్ చేయడమేంటని అక్కడి వారు ప్రశ్నించారు.

ఈ విష‌య‌మై స‌మాచారం అందుకున్న పోలీసుల‌కు అక్క‌డికి చేరుకున్నారు. అయితే ముంద‌స్తు అనుమ‌తి తీసుకుని షూటింగ్ చేప‌ట్టార‌ని, ఎలా అడ్డుకుంటార‌ని పోలీసులు ప్ర‌శ్నించ‌డంతో అక్కడి జనాలు శాంతించినట్టు తెలుస్తోంది. మొత్తానికి సుధీర్ సినిమా ఇలా వార్తల్లో వైరల్ అయింది. కానీ కరోనా విస్తరిస్తున్న వేళ ఇలా జన సమూహాలు తిరిగే ప్రదేశాల్లో షూటింగ్‌లంటే కత్తి మీద సాము వంటిదే.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp