Bigg Boss Telugu 7 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. పూజ ఔట్.. నా వల్ల కాదు అని నాగార్జునకు చెప్పి వెళ్లిపోయిన శివాజీ.. నాగ్ షాక్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: October 22, 2023, 12:00 pm

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ 7 లో శనివారం నాటికి 50 రోజులు అయింది. అంటే సగం రోజుల బిగ్ బాస్ పూర్తయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇంకో సగం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న వాళ్లలో చాలామంది కంటెస్టెంట్లు ఎలాగోలా తమకు ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోగలిగారు. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్లలోనూ అర్జున్ బాగానే ఆడుతున్నాడు. భోలే షావలి అయితే ఎంటర్ టైనర్ అని చెప్పుకోవచ్చు. అయితే.. దసరా సందర్భంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఇద్దరు బయటికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఒకరు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేది ఎవరో ఇప్పటికే లీక్ అయిన విషయం తెలుసు కదా. బిగ్ బాస్ సీజన్ 7 లోకి అతి తక్కువ ఓట్లు వచ్చిన రతిక మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇక ఈ వారం అతి తక్కువ ఓట్లు పూజా మూర్తికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ వారం పూజా మూర్తిని ఇంటికి పంపించేశారు. ఇక.. తన అనారోగ్య కారణాల వల్ల శివాజీ కూడా హౌస్ నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4 లో గంగవ్వ ఎలాగైతే హౌస్ ను వదిలేసి మధ్యలోనే వెళ్లిపోయిందో.. సేమ్ టు సేమ్ శివాజీ కూడా తన వల్ల కాక వెళ్లిపోతానని మరోసారి నాగార్జునకు రిక్వెస్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో శివాజీని నాగార్జున పూజాను పంపించిన తర్వాత ఎలిమినేట్ చేసి పంపించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఆదివారం దసరా స్పెషల్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోనుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో పాటు అతి తక్కువ ఓట్లు వచ్చిన రతిక రీ ఎంట్రీ ఇవ్వనుంది.

pooja and shivaji eliminated from bigg boss house rathika reentry

#image_title

Bigg Boss Telugu 7 : శివాజీ పెద్ద పాము అంటూ నాగ్ కు చెప్పిన కంటెస్టెంట్లు

ఇక.. శనివారం ఎపిసోడ్ లో శివాజీ పెద్ద పాము అని చాలామంది కంటెస్టెంట్లు చెప్పారు. దీంతో శివాజీకి ఇంకాస్త బాధ వేసింది. నిజానికి శనివారం ఎపిసోడ్ లోనే నాగ్.. శివాజీతో మాట్లాడినా శివాజీ మాత్రం అస్సలు ఉండనంటే ఉండను అని చెప్పాడు. దీంతో శివాజీని ఇంట్లో నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి పంపించారు. ఇక.. డేంజర్ జోన్ లో పూజా ఉన్న విషయం తెలిసిందే. ఆమె తర్వాత డేంజర్ జోన్ లో అశ్వని ఉండగా.. అశ్వనీ ఒకవేళ వచ్చే వారం నామినేట్ అయితే ఖచ్చితంగా తనే ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp