CPI Narayana : పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు.. ముందు నాగార్జునను బొక్కలో వేయండి.. బిగ్ బాస్‌పై సీపీఐ నారాయణ ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

CPI Narayana : పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు.. ముందు నాగార్జునను బొక్కలో వేయండి.. బిగ్ బాస్‌పై సీపీఐ నారాయణ ఫైర్

CPI Narayana : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ గురించే చర్చ. బిగ్ బాస్ విన్నర్ కాకముందు ప్రశాంత్ గురించి ఎంత చర్చించారో అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఆయన గురించి జనాలు చర్చిస్తున్నారు. దానికి కారణం.. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక బయటికి వచ్చి చేసిన పిచ్చి పని వల్ల. లక్షలాది మంది జనాలు వచ్చారు.. అక్కడ ఉండొద్దు.. ర్యాలీ గట్రా చేయొద్దు.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఓవైపు బిగ్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :23 December 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  నాగార్జునపై సీపీఐ నారాయణ ఫైర్

  •  బిగ్ బాస్ యాజమాన్యం పై కేసు పెట్టాలని నారాయణ ఫైర్

  •  పల్లవి ప్రశాంత్ ను అందరం కలిసి కాపాడుకోవాలి

CPI Narayana : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ గురించే చర్చ. బిగ్ బాస్ విన్నర్ కాకముందు ప్రశాంత్ గురించి ఎంత చర్చించారో అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఆయన గురించి జనాలు చర్చిస్తున్నారు. దానికి కారణం.. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక బయటికి వచ్చి చేసిన పిచ్చి పని వల్ల. లక్షలాది మంది జనాలు వచ్చారు.. అక్కడ ఉండొద్దు.. ర్యాలీ గట్రా చేయొద్దు.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఓవైపు బిగ్ బాస్ యాజమాన్యం చెప్పినా వినలేదు.. చివరకు పోలీసులు చెప్పినా పల్లవి ప్రశాంత్ వినలేదు. దాని వల్ల పల్లవి ప్రశాంత్ మీద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. అయితే.. ఈ ఘటనపై తాజాగా సీపీఐ నారాయణ స్పందించారు. బిగ్ బాస్ రియాల్టీ షో పేదవాళ్లకు ఎంతో అన్యాయం చేస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులపై కేసు పెట్టాలి లేదంటే నాగార్జునపై పెట్టాలి కానీ రైతు బిడ్డ పై ఎందుకు కేసు పెట్టారు అని నారాయణ ప్రశ్నించారు.

పేద వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ను కావాలని తీసుకెళ్లి అందులో పెట్టి.. ప్రైజ్ ఇచ్చారు. ఇదంతా కావాలని చేసిందే. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను మభ్యపెట్టేందుకు ఇదంతా చేస్తున్నారు. బయటికి వచ్చాక పిల్లలు కొట్లాడుకుంటే ప్రశాంత్ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. పోలీసులు బిగ్ బాస్ కు ఏజెంట్ గా పని చేస్తున్నారా? బిగ్ బాస్ మేనేజ్ మెంట్, బిగ్ బాస్ హోస్ట్ మీద కేసులు పెట్టాలి. ప్రశాంత్ మీద పెట్టిన కేసులన్నీ పోలీసులు వెంటనే ఉపసంహరించుకోవాలి అని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

CPI Narayana : తెలంగాణ చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన సీపీఐ నారాయణ

ఈ ఘటనపై తెలంగాణ చీఫ్ జస్టిస్ కు సీపీఐ నారాయణ లేఖ కూడా రాశారు. ఆయన వారంలో దీనిపై విచారణ చేస్తామన్నారు. లేదంటే పిల్ కూడా వేస్తాం. బిగ్ బాస్ దురాగతాలకు ఒక రైతు బిడ్డ అన్యాయం అయ్యాడు. దీన్ని అందరూ కలిసి ఖండించాలి. బిగ్ బాస్ మీద ఫైట్ చేసి రద్దు చేసేవరకు కొట్లాడుతా అని సీపీఐ నారాయణ స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది