Pooja Hegde : తెలుగులో వరుణ్ తేజ్ నటించిన ‘ ముకుంద ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. అప్పట్లో ఐరన్ లెగ్ అని ముద్ర కూడా పడింది. దీంతో బాలీవుడ్ కి వెళ్ళిన బ్యూటీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. అయితే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాతో అమ్మడు కెరీర్ పూర్తిగా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలు అందరితో నటించి ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పూజా హెగ్డే నిలిచింది. ప్రస్తుతం పూజ హెగ్డే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ గుంటూరు కారం ‘ సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించబోతున్న సినిమాలో కూడా హీరోయిన్గా పూజ హెగ్డే నటించబోతుందట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే కోలీవుడ్ లో లింగుస్వామి దర్శకత్వం వహించబోతున్న కార్తి హీరోగా తెరకెక్కనున్న పయ్యా 2 సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా ఖరారు చేశారంట. ఈ సినిమా తెలుగులో ఆవారా 2 గా రానుంది. కార్తి హీరోగా వచ్చిన ఆవారాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుందని ప్రచారం నడుస్తోంది.
ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా ఎంపికైంది. గతంలో ఈ సినిమా కోసం హీరోయిన్గా పూజ హెగ్డే ని ఖరారు చేశాడు హరీష్ శంకర్. అయితే పూజ హెగ్డే డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆమె ప్లేస్ లోకి శ్రీ లీలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. ఈ పాత్రలోనే పూజ హెగ్డే కనిపించబోతున్నట్లు సమాచారం. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలను చేస్తుంది పూజ హెగ్డే. అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన సర్కస్, కీసీ కా భాయ్ కీసి కా జాన్ సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. అయినా కానీ ఈ బ్యూటీకి బాలీవుడ్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.