Pooja Hegde : కేన్స్‌లో పూజా హెగ్డే సంద‌డి.. వెరైటీ డ్రెస్సుల‌లో మ‌త్తెక్కిస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: May 19, 2022, 10:00 pm

Pooja Hegde : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్లుగా త‌మ స‌త్తా చూపించారు. వారిలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందమే కాదు.. అద్భుతమైన హవాభావాలను పలికిస్తూ చేసే అభినయంతో ఎంతో మందిని తన వైపునకు తిప్పుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇలా చాలా కాలంగా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు తెగ సందడి చేస్తోంది. పూజా హెగ్డే ఫొటోలు చూసి కుర్ర‌కారు మతులు పోతున్నాయి.

అమ్మ‌డి పిక్స్ కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తుంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫస్ట్ టైమ్‌ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. 2022కి గానూ జరిగే 75వ కాన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టాలీవుడ్‌ హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నాలు పాల్గొన్నారు. బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనె, ఐశ్వర్యరాయ్‌, హినా ఖాన్‌లు సందడి చేస్తున్నారు. అయితే వీరిలో పూజా ప్రత్యేకంగా నిలవడం విశేషం. వెరైటీ డ్రెస్సులలో పూజా హెగ్డే చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. పూజా హెగ్డే ట్రెండీ డిజైనింగ్‌ గౌన్‌లో మెరిసింది. జబ్బలపై నుంచి గౌన్‌ జారిపోతున్నట్టుగా ఉన్న ఈ సరికొత్త ఫ్యాషన్‌ దుస్తుల్లో కనువిందు చేసింది పూజా. కాన్‌ తీరన ఉన్న నది వద్ద ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. వాటిని సోషల్‌ మీడియాలో పంచుకోగా, ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

Pooja Hegde enjoyed in cannes

Pooja Hegde enjoyed in cannes

Pooja Hegde : పూజా నాన్‌స్టాప్ హంగామా..

వైరల్‌ అవుతున్నాయి.కెరీర్ ఆరంభంలో అంతగా సక్సెస్‌ కాలేకపోయిన పూజా హెగ్డే.. ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో హిట్ ట్రాక్ ఎక్కింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో వరుస హిట్లతో హవాను చూపిస్తూ ముందుకు సాగింది. ఇటీవ‌ల రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాల‌తో వ‌రుస ఫ్లాపుల‌ని మూటగ‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌కి ఆఫ‌ర్స్ బాగానే వ‌స్తున్నాయి. పెద్ద హీరోల‌తో సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp