Home » Entertainment » Pooja Hegde Feels Very Happy For Ala Vaikunthapurramuloo Awards
Entertainment

Pooja Hegde : వాటిని పక్కలో పెట్టుకుని పడుకున్న బుట్టబొమ్మ.. పూజా హెగ్డే ఫుల్ హ్యాపీ!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 18, 2021, 5:59 pm
Advertisement

Pooja Hegde అల వైకుంఠపురములో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. బాక్సాఫీస్ లెక్కలన్నీ ఒకెత్తు అయితే.. సోషల్ మీడియా రికార్డులు మరో ఎత్తు. ఇక బుల్లితెరపై ప్రతీసారి సాధిస్తున్న టీఆర్పీలు చూస్తే ఎవ్వరైనా కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. అలా అల వైకుంఠపురములో సినిమా మ్యాజిక్ చేసేసింది.

Advertisement

Pooja Hegde Feels Very Happy For Ala Vaikunthapurramuloo Awards

అల్లు అర్జున్ త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి రావడం, ఇలా బ్లాక్ బస్టర్ కొట్టేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక ఈ సినిమాతో పూజా హెగ్డే Pooja Hegde ఫేట్ మారిపోయింది. అసలే మంచి ఫాంలో ఉన్న పూజా హెగ్డేకు అల వైకుంఠపురములో మరింత ఊపునిచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్‌లో ఇలా అన్ని ఇండస్ట్రీల కన్ను పడింది. అలా మొత్తానికి పూజా హెగ్డే మాత్రం ఇప్పుడు దుమ్ములేపుతోంది.

Advertisement

 

Pooja Hegde Feels Very Happy For Ala Vaikunthapurramuloo Awards

Advertisement

అవార్డులతో పూజా హెగ్డే ఖుషీ Pooja Hegde

అయితే తాజాగా మరోసారి అల వైకుంఠపురములో సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. సాక్షి మీడియా ప్రతీ ఏటా ఇచ్చే ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో అల వైకుంఠపురములో సత్తా చాటింది. మొత్తంగా ఐదు కేటగిరల్లో అవార్డులు వచ్చాయి.ఉత్తమ నటుడు, నటి కేటగిరిల్లో అల వైకుంఠపురములో సినిమాకు అవార్డులు వచ్చాయి.

 

Pooja Hegde Feels Very Happy For Ala Vaikunthapurramuloo Awards

ఇక పూజా హేగ్డే వాటిని చూసి తెగ మురిసిపోయింది. ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి, షూటింగ్‌కు వెళ్లి ఎంతో కష్టపడ్డాను.. చివరకు ఇళా అవార్డ్ దక్కింది అంటూ పూజా హెగ్డే ఎమోషనల్ అయింది. ఆ అవార్డును పక్కన పెట్టుకుని అలా నిద్రపోయింది. అలా మొత్తానికి అంతా మంచే జరిగిందని చెప్పేసింది. పూజా హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Advertisement

 

Pooja Hegde Feels Very Happy For Ala Vaikunthapurramuloo Awards

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి