Pooja hegde : హీట్ పుట్టిస్తున్న పూజా లుక్స్.. నెటిజన్స్ ఫిదా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja hegde : హీట్ పుట్టిస్తున్న పూజా లుక్స్.. నెటిజన్స్ ఫిదా..

 Authored By mallesh | The Telugu News | Updated on :11 December 2021,1:00 pm

Pooja hegde : పూజాహెగ్దే.. ఈ పేరు సినీ ప్రేక్షకులకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగచైతన్య యాక్ట్ చేసిన ఒక లైలా కోసం మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బుట్టుబొమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా మారింది. 2014లో ఎంట్రీతోనే ఒకలైలా కోసం, ముకుంద మూవీల్లో నటించింది. మూడేండ్ల గ్యాప్ తర్వాత అల్లుఅర్జున్ తో దువ్వాడ జగన్నాథం మూవీలో యాక్ట్ చేసింది. అంతకు ముందు మూవీల్లో ట్రెడిషనల్ క్యారెక్టర్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ..

దువ్వాడ జగన్నాథం మూవీలో తన అందాలను ఆరబోసింది.ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోయినా.. పూజాకు మాత్రం ఆఫర్స్ వరస కట్టాయి. ఆ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబుతో కలిసి మహర్షి సినిమా చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అనంతరం గద్దల కొండ గణేష్, అలా వైకుంఠపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి మూవీస్ తో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది ఈ భామ.

pooja hegde photo viral

pooja hegde photo viral

Pooja hegde : హాట్ హాట్ లుక్స్

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రాధేశ్యామ్, చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీస్‌లో యాక్ట్ చేస్తోంది.తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో వైరల్ గా మారింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో కుర్రకారును కైపెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తోంది. దీనిని చూసిన నెటిజన్స్ చూపును తిప్పుకోలేకపోతున్నారు. కొంత మంది హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది