pooja hegde looks are stunning
Pooja Hegde : ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్‌లో పాపులారిటీ లేని సమయంలో పూజా హెగ్డేను దిల్ రాజు తన సినిమాల్లోకి తీసుకొని రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు తన ఖాతాలో వేశారు. డీజే, మహర్షి చిత్రాలు పూజా హెగ్డేకు భారీ విజయాలను అందించాయి. ఆ తర్వాత పూజా హెగ్డే వెనుదిరిగి చూసుకోలేకపోయింది. ఇటీవల ఆమె నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది… రాధేశ్యామ్ చిత్రంలో పూజా నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా చిత్రాల్లో చోటు దక్కించుకుంటోంది…
పూజా. ఇక వరుస ఆఫర్లతో ఇంత బిజీగా ఉన్న సమయంలో కూడా పూజా ఓ ఐటెమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ దానికోసం భారీ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తు్న్నట్టు టాక్.పూజా.. ప్రభాస్‌తో కలిసి నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా ఇటీవల విడుదలయ్యి తన యాక్టింగ్‌కు మంచి మార్కులు పడేలా చేసింది… ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన ‘బీస్ట్’తో పూజా కోలీవుడ్‌లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక బీస్ట్ సినిమాలో పూజా గ్లామర్‌కు, డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతలోనే పూజాకు ఓ మల్టీ స్టారర్ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఛాన్స్ వచ్చిందని టాక్.
pooja hegde looks are stunning
అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 చిత్రంలో పూజా ఐటెం సాంగ్ చేయనుందని, దీని కోసం కోటిన్నర డిమాండ్ చేస్తుందని టాక్.అయితే గత కొద్ది రోజులుగా పూజా హెగ్డే బీస్ట్ ప్రమోషన్ కార్యక్రమాలతోబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో వైట్ డ్రెస్‌లో ధగ ధగ మెరిసిపోతుంది పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు… ఇక ఈ భామ నటించిన ‘బీస్ట్’ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది… మరోవైపు ఈ భామ నటించిన ‘ఆచార్య’ కూడా ఈ నెలాఖారులో రిలీజ్ కానుంది. ఇలా ఒకే నెలలో బుట్టబొమ్మ నటించిన రెండు సినిమాలు విడుదల కావడం ఇదే మొదటిసారి. రాధే శ్యామ్ కలిపితే.. ఈ యేడాది ఈ భామ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి.
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
This website uses cookies.