Jani Master Fun WIth Hyper aadi In Dhee Show
Jani Master : జానీ మాస్టర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్‌గా దూసుకుపోతోన్నాడు జానీ మాస్టర్. కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ జానీ మాస్టర్ తన సత్తా చాటుతున్నాడు. ఇక తెలుగులో అయితే జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తే అవి ట్రెండ్ అవుతాయి. ఈ మద్యే బీస్ట్ సినిమాలో విజయ్, పూజా హెగ్డేలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. అరబిక్ కుత్తు, హళమితి హబిబీ అంటూ అందరినీ ఊపు ఊపేశాడు జానీ మాస్టర్. అలాంటి జానీ మాస్టర్ కెరీర్ ఢీ షోతో మొదలైంది. ఢీ షోలో కంటెస్టెంట్‌గా మొదలై.. అదే షోకు న్యాయ నిర్ణేతగా వచ్చే స్థాయికి జానీ మాస్టర్ ఎదిగిపోయాడు.
అయితే జానీ మాస్టర్ కంటెస్టెంట్‌గా ఢీ షోలో ఉన్నప్పుడు తెగ అగ్రెసివ్‌గా ఉండేవాడు. జడ్జ్‌లను సైతం ఎదురించి మాట్లాడేవాడు. ముక్కుసూటిగా ఉండేవాడు. ఏదనిపిస్తే అది అనేవాడు. అలా ఎన్నో కాంట్రవర్సీలు జరిగాయి.అప్పుడు గనుక సోషల్ మీడియా ఉండుంటే.. జానీ మాస్టర్ పేరు మార్మోగిపోయేది.అయితే ఇప్పుడు జానీ మాస్టర్ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. తాజాగా వదిలిన ఢీ షో ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో హైపర్ ఆది, జానీ మాస్టర్ కలిసి స్టెప్పులు వేశారు. ఇక డ్యాన్సుల్లో జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జానీ మాస్టర్ స్టెప్పులు వేస్తుంటే.. ఆది పిచ్చి గెంతులు వేసేశాడు.
Jani Master Fun WIth Hyper aadi In Dhee Show
దీంతో అందరూ నవ్వేశారు. అయితే ఆది మాత్రం జానీ మాస్టర్‌తో సరిసమానంగా చేసినట్టు బిల్డప్ ఇచ్చాడు. మొత్తానికి జానీ మాస్టర్ అలా అనడంతో హర్ట్ అయినట్టున్నాడు. టై అయిందని ఆది అనడంతోనే.. జానీ మాస్టర్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. గతంలో ఢీ షోలో తాను అన్న మాటలను చెప్పుకొచ్చాడు. నాకు డ్యాన్స్ రాదు. యాక్టింగ్ రాదు.. నేను వెళ్లిపోతా అంటూ స్టేజ్ దిగి వెళ్లిపోయాడు జానీ మాస్టర్. నాటి సీన్‌ను నేడు రిపీట్ చేసి వెళ్లిపోతోంటే.. జానీ మాస్టర్ జానీ మాస్టర్ అని ఆది అరుస్తూ స్టేజ్ మీదే ఉండిపోయాడు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.