పూజా : ఇదేం వర్కవుట్ రా బాబు.. భర్త మీదకు ఎక్కేసిన బిగ్ బాస్ బ్యూటీ
పూజా : బిగ్ బాస్ షో ద్వారా బాగా ఫేమస్ అయింది పూజా రామచంద్రన్. రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ అందరిపై తన ముద్రను వేసింది. ఉన్నది కూడా కొన్ని వారాలే అయినా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును వేసుకుంది. మగ కంటెస్టెంట్లకు ధీటుగా ఆటలు ఆడి స్ట్రాంగ్ అని నిరూపించుకుంది. కానీ ఎక్కువ రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండలేకపోయింది. అయితే పూజా రామచంద్రన్‌కు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు సినిమాల ద్వారా సంపాదించిన క్రేజ్ కంటే ఎక్కువగా బిగ్ బాస్ వల్ల వచ్చింది.
బిగ్ బాస్ వల్ల క్రేజ్ వచ్చింది కానీ ఆఫర్లు మాత్రం అంతగా రాలేదు. అవే సైడ్ క్యారెక్టర్స్‌తో ఒకటి అరా చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ కంటే ముందుగా లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా చిత్రాలతో పూజా మంచి పేరును సంపాదించుకుంది. అలా పూజా రామచంద్రన్‌కు బిగ్ బాస్ తరువాత చెప్పుకోదగ్గ ఆఫర్ ఒక్కటి రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడికి మాత్రం ఫుల్ పాపులార్టీ వచ్చింది. బిగ్ బాస్ షోలో ఈమెను చూస్తే ఓ విషయం అందరికీ అర్థమై ఉంటుంది. క్రమం తప్పకుండా వర్కవుట్లు చేయడం ఆమె అలవాటు.
ఆమె తన భర్తతో కలిసి చేసే వర్కవుట్లు, విన్యాసాలు, యోగాసానాలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరూ కలిసి బీచ్‌లో సందడి చేస్తుంటారు. బికినీలో పూజా రామచంద్రన్ అందాలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ ఇద్దరూ కలిసి వర్కవుట్లు చేసుకుంటూ మధ్యలో సరదాగా వెరైటీ వ్యాయామం చేసినట్టున్నారు. భర్త మీదకు ఎక్కేసిన పూజా రామచంద్రన్ పోజ్ భలేగా పెట్టేసింది. రోజూ చేసే వర్కవుట్లలో ఇలా ఈ రోజు మాత్రం కాస్త రొమాంటిక్‌గా మారిపోయింది.