poonam kaur strong comments on directors
Poonam Kaur : టాలీవుడ్ అందాల హీరోయిన్ పూనమ్ కౌర్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్‌గా పూనమ్ తన ట్విట్టర్‌లో ” నేను మనస్ఫూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు.. ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళను వాళ్ళు తక్కువ చేసుకొని చేతులు కట్టుకొని ఉండడం బాధనిపిస్తోంది. వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి” అని రాసి దానికి బ్రోకెన్ హార్ట్ సింబల్ కూడా జోడించింది. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే ఈ ట్వీట్ ని పూనమ్ డిలీట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండగా వర్మ ట్వీట్‌కి అదిరిపోయే రిప్లై ఇచ్చి వార్తలలోకి ఎక్కింది.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ స్పీచ్ మీద రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లని ట్యాగ్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చాలా సెటిల్డ్‌గా మాట్లాడాడు. ఎక్కడా గాడి తప్పకుండా.. భీమ్లా నాయక్ ఈవెంట్‌లో మాట్లాడేశాడు. దీని మీద వర్మ ట్వీట్ వేశాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచుల్లో ఇదే బెస్ట్ స్పీచ్.. ఎంతో ఎమోషనల్‌గా అనిపించింది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ వేసిన ట్వీట్ మీద పూనమ్ కౌర్ కౌంటర్ వేసింది. అయితే వర్మ వేసిన ట్వీట్‌ను రీట్వీట్ వేస్తూ పూనమ్ కౌర్ స్పందించింది. ఓ డైరెక్టర్ ఎదుటి వారి జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాడు..
poonam kaur strong comments on directors
ఓ మూల నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తాడు.బయటి జనాలు తిడుతుంటే.. సైలెంట్‌గా ఉంటాడు . ఇక ఇంకో డైరెక్టర్ అయితే ఎదుటివారిని తక్కువ చేస్తాడు.. ట్విట్టర్‌లో నవ్వుతుంటాడు. ఆ ఇద్దరూ కూడా అమ్మాయిలను ఆయుధాలుగా వాడుకుంటారు అని అనేసింది పూనమ్ కౌర్. ఆమె ట్వీట్‌పైఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.శ్రీకాంత్ హీరోగా వచ్చిన మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూనమ్.. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాలలో నటించింది. ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కాంట్రవర్సీస్‌తో కాపురం చేస్తుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.