Poonam kour : పూనమ్ కౌర్ ఎమోషనల్ ట్వీట్.. ఇండస్ట్రీలో దేవుడు లాంటి వారొక్కరే అంటూ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసిందిగా

Authored By vamana sai | The Telugu News | Updated on : 29 September 2021, 7:59 pm

Poonam kour: రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి..ఈవెంట్‌లో వైసీపీ నాయకులను ఏకేయడం..తర్వాత రోజు నుంచి పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజు ప్రముఖ దర్శకుడు, రచయిత, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళి సీన్‌లోకి ఎంటరవడంతో అసలు కథేంటో ఆ కథ ఎటు సాగుతుందో అర్థ కావడం లేదు. ఎవరి సినిమాలో ఎవరు నటిస్తున్నారో ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో అంతా పెద్ద కన్‌ఫ్యూజన్ డ్రామా నడుస్తోంది.

poonam kour emotional tweet

poonam kour emotional tweet

ఈ డ్రామాలోకి పూనమ్ కౌర్‌ను లాక్కొచ్చారు. ఈ మధ్య ఆమె ఎక్కడుందో కూడా తెలీదు. ఏం చేస్తుందో తెలీదు. కానీ మళ్ళీ ట్వీట్స్‌తో సూదుల్లా పొడిచేలా చేశారు. జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినందుకు ఆయన తరపున పోసాని కృష్ణమురళి రెచ్చిపోతున్నారు. రక రకాలుగా పవన్ కళ్యాణ్ గత విషయాలను తవ్వి మరీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఈ ఫ్లోలోనే ఓ పంజాబీ అమ్మాయిని పెద్ద మనిషి ఒకరు కడుపు చేసి మోసం చేయలేదా..అది నీకు తెలియదా..నువ్వు ఆడబిడ్డలకి అన్యాయం జరిగితే తోలు తీస్తానని సినిమాలో డైలాగ్ చెప్పువుగా. బయట కూడా ఇలాంటి డైలాగులు చెబుతున్నావు కదా.

poonam kour emotional tweet

poonam kour emotional tweet

Poonam kour: పూనమ్ కౌర్ ఏదో ఒక రహస్యాన్ని చెప్పడానికి ట్రై చేసి మళ్ళీ సైలెంట్ అయిపోయింది.

ఆ అమ్మాయి పేరు నీకు చెవులో చెబుతా. ఆ అమ్మాయికి న్యాయం చేస్తే నీకు గుడి కట్టిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆ అమ్మాయి పూనమ్ కౌర్ అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆమెకి న్యాయం జరగాలని ఆమె పేరుతో హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నారు. దీనికి పూనమ్ కౌర్ “మీరున్నారనే సందేశాన్ని ఆ దేవుడు నాకు ఈ రోజు పంపించినట్టు అనిపిస్తోంది.. ఐ మిస్ యూ.. ఇండస్ట్రీలో ఉన్న ఏకైక గురు దాసరి గారు.. ఐ మిస్ యూ.. తండ్రి సమానులు” అంటూ పూనమ్ కౌర్ ఏదో ఒక రహస్యాన్ని చెప్పడానికి ట్రై చేసి మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు పూనమ్ కౌర్ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

poonam kour emotional tweet

poonam kour emotional tweet

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp