Jabardasth Comedian : సినిమా చేసిస్తానని 30 లక్షలు మింగేసిన జబర్దస్త్ కమెడియన్.. గగ్గోలు పెడుతున్న నిర్మాత
Jabardasth Comedian: సినిమా ఇండస్ట్రీలో మోసాలు సర్వ సాధారణం. ఈ రంగుల ప్రపంచంలో మోసపోయేవారే ఎక్కువ. కృష్ణ నగర్, ఇందిరా నగర్, ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో సినిమా అవకాశాల కోసం, సినిమాలలో వేశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగి చివరికి తిండికి కూడా చేతిలో రూపాయి లేక ఉసూరుమంటూ వచ్చినదారినే వెళ్ళేవారు లెక్కకుమించే. ఇక కాస్త చిన్న చిన్న వేశాలు వేసే అవకాశాలు దక్కించుకొని స్మాల్ స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన వారు ఆ తర్వాత పెద్ద సెలబ్రిటీలలా ఫీలవుతూ కొత్తగా అవకాశాల కోసం వచ్చే వారిని నమ్మించి మోసం చేయడమూ తరచూ జరుగుతున్నదే.
ఇదంతా రంగుల ప్రపంచంలో ఉన్న మాయ. నీకు నేను అవకాశం ఇప్పిస్తాను..నాకు వాళ్లు తెలుసూ, వీళ్లు తెలుసూ అని ఇంటిదగ్గర్నుంచి తెచ్చుకున్న డబ్బులను కాజేసి నెమ్మదిగా మొహం చాటేసే వారు కోకొల్లలు. ప్రముఖ సినీ తారలు అయిన విజయ్ దేవరకొండ, నితిన్ లాంటి వారి పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆడిషన్స్ ఉన్నాయని..మా నెక్స్ట్ సినిమాలో అవకాశం ఉందంటూ డబ్బులు దండుకుంటున్న ప్రబుద్దులు..చివరికి దొరికేసరికి ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలనిఉ మన టాలీవుడ్ స్టార్స్ చాలాసార్లు చెప్పారు.
Jabardasth Comedian: ఆ మొత్తం నేనెక్కడ తెచ్చి ఇవ్వాలని చేతులెత్తేసినట్టు చెప్పుకుంటున్నారు.
ఇలాంటి సంఘటన తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్ళు జబర్దస్త్‌లో ఉన్న శ్రీధర్ అనే కమెడియన్.. ఆ తర్వాత ఛానెల్ మారి.. ఇటీవలే సినిమా దర్శకుడిగా మారాడు. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అవ్వాలనే కోరికతో ఫేడౌట్ అయిన హీరోకి కథ చెప్పి ఒప్పించాడు. అంతేకాదు తన సొంత ఊరు నుంచి నిర్మాతను కూడా తీసుకువచ్చి సినిమా మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో మొదటి సినిమాయే కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చాడు కమెడియన్.
కనీసం కోటి రూపాయల మార్కెట్ కూడా లేని హీరోతో భారీ బడ్జెట్ సినిమా అంటే అయ్యేపనేనా. అందుకే ఆలస్యంగా విషయం తెలుసుకున్న నిర్మాత ఆ కమెడియన్‌తో సినిమా చేయనని..ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇచ్చేయమని చెప్పాడట. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌కి దాదాపు 30 లక్షలు ఖర్చు చేయించాడట. ఇప్పుడు ఆ మొత్తం నేనెక్కడ తెచ్చి ఇవ్వాలని చేతులెత్తేసినట్టు చెప్పుకుంటున్నారు. మొత్తానికి జబర్దస్త్ కమెడియన్ నిర్మాతను 30 లక్షలు ముంచినట్టే అని చెప్పుకుంటున్నారు.