Poorna : పూర్ణ పెళ్లిపై పుకార్లే పుకార్లు.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Poorna : పూర్ణ పెళ్లిపై పుకార్లే పుకార్లు.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ

 Authored By sandeep | The Telugu News | Updated on :12 August 2022,7:20 pm

Poorna : ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన పూర్ణ ఇప్పుడు టీవీ జ‌డ్జిగా సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. పూర్ణ పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కాగా, పూర్ణ నిశ్చితార్థం గత జూన్ మాసంలోనే జరిగింది. యూఏఈకి చెందిన బిజినెస్ మేన్ షనీద్ ఆసిఫ్ అలీను ఆమె పెళ్లి చేసుకోనుంది. అయితే, వీరి పెళ్లి రద్దు అయిందంటూ ఇటీవల కథనాలు వస్తున్నాయి. దీనిపై పూర్ణ స్పందించింది. ఒక్క ఫొటోతో ఊహాగానాలన్నింటికి చెక్ పెట్టింది. ‘ఎప్పటికీ అతడు నా వాడే..’ అంటూ ఫొటోపై కామెంట్ చేసింది. అంతేకాదు, లవ్ సింబల్స్ కూడా పోస్టు చేసి తమ అనుబంధం మరింత ప్రేమాస్పదం అని పేర్కొంది. ఆ ఫొటోలో పూర్ణ, షనీద్ సన్నిహితంగా ఉండడాన్ని చూడొచ్చు. దీంతో అనేక పుకార్ల‌కు చెక్ ప‌డింది.

Poorna : పుకార్ల‌కి చెక్..

క్లాసికల్ డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత హీరోయిన్‌గా స్థిరపడిన టాలెంటెడ్ యాక్ట్రెస్ పూర్ణ అలియాస్ సామ్నా కాసీం ఒకరు. పేరుకు మలయాళీ భామే అయినా.. తెలుగులో చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులర్ అయింది. ఫలితంగా తెలుగులోని ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హీరోయిన్ పూర్ణ ‘శ్రీ మహాలక్ష్మీ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు ‘అవును’, ‘అవును 2′ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

Poorna Clarity On Her Marriage Rumours

Poorna Clarity On Her Marriage Rumours

ఈ క్రమంలోనే ‘సీమటపాకాయ్’, ‘సిల్లీ ఫెలోస్’, ‘అదుగో’, ‘రాజుగారి గది’, ‘మామ మంచు అల్లుడు కంచు’ సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. చాలా కాలం పాటు హీరోయిన్‌గా సందడి చేసిన పూర్ణ.. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలు చేసింది. ఇప్పటికే ఆమె ‘తలైవి’ మూవీలో శశికళ పాత్రను పోషించి సత్తా చాటింది. అలాగే, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేష్ ‘దృశ్యం 2′ సహా ఎన్నో భారీ చిత్రాల్లో భాగం అయింది. అలాగే, నాని ‘దసరా’ మూవీలో విలన్ పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది