Poorna : ఏంద‌మ్మ ఆ జోష్‌.. రారా అంటూ రెచ్చ‌గొడుతున్న పూర్ణ‌ డ్యాన్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Poorna : ఏంద‌మ్మ ఆ జోష్‌.. రారా అంటూ రెచ్చ‌గొడుతున్న పూర్ణ‌ డ్యాన్స్..

 Authored By sandeep | The Telugu News | Updated on :31 July 2022,12:00 pm

Poorna : ఇటీవ‌ల కొన్ని మాట‌లు ఆడియ‌న్స్‌కి బాగా క‌నెక్ట్ అవుతున్నాయి. అలాంటి వాటిలో రారా ర‌క్క‌మ్మ ఒక‌టి. కన్న‌డ హీరో సుదీప్ హీరోగా తెర‌కెక్కిన విక్రాంత్ రోణా సినిమాలోని ఈ పాట తెగ వైర‌ల్ అవుతుంది. ప్ర‌తి ఒక్కరు ఈ పాట‌కు చిందులేస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో క‌లిసి సుదీప్ ఈ పాట‌కు స్టెప్పులేశాడు. తాజాగా ఈ పాట‌కు పూర్ణ డ్యాన్స్ చేసింది. ఇప్ప‌టికే ఢీ షోకి జ‌డ్జిగా వ్య‌హ‌రించిన ఈ ముద్దుగుమ్మ అద‌ర‌గొట్టేసింది. చీర‌క‌ట్టులోను ఈ ముద్దుగుమ్మ అందంగా డ్యాన్స్ చేయ‌డం అభిమానుల‌కి స‌రికొత్త వినోదాన్ని పంచుతుంది. ప్ర‌స్తుతం పూర్ణ వీడియో నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. మలయాళీ బ్యూటీ పూర్ణ వరుస చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది.

ఇటు సినిమాల్లో నటిస్తూనే అలు టెలివిజన్ షోలలోనూ మెరుస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ మతి చెడగొడుతోంది. ప్రొఫెషనల్ డాన్సర్ గా, మోడల్ గా ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగు ఆడియెన్స్ కు మాత్రం ‘అవును’ చిత్రంతో బాగా దగ్గరైంది. ఆ తర్వాత పలు టీవీషోల్లోనూ మెరుస్తూ అలరిస్తోంది.ఇటీవల వచ్చిన బాలయ్య ‘అఖండ’లో పూర్ణ ఓ ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మూవీలో ఈ బ్యూటీ నటనకూ మంచి మార్కులు పడ్డాయి. వెండితెరపై కనువిందు చేస్తూ మళ్లీ సినిమాలపై జోరు పెంచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘దసరా, బ్యాక్ డోర్’, వృత్తం అనే మలయాళం చిత్రాల్లో నటిస్తోంది.

Poorna dance video viral on instagram

Poorna dance video viral on instagram

Poorna : పూర్ణ చిందులు..

త్వరలో పూర్ణ పెళ్లిపీటలెక్కనుంది. కొద్దిరోజుల క్రితం ఆమె కాబోయేవాడిని పరిచయం చేసింది. షానిద్ అసిఫ్ అలీ వ్యక్తిని పూర్ణ పెళ్లి చేసుకోబుతుంది. చాలా మంది ఆమె స్క్రీన్ నేమ్ ఆధారంగా హిందువు అని భ్రమపడుతూ ఉంటారు. కానీ పూర్ణ ముస్లిమ్ అమ్మాయి. ఆమె అసలు పేరు షామ్నా ఖాసీం. ఇక పూర్ణకు భర్త కానున్న షానిద్ బిజినెస్ మెన్ అని సమాచారం. అతని ప్రొఫైల్ ని బట్టి చూస్తే జేబిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ. ధనవంతుడైన వ్యాపారవేత్తను వివాహమాడి పూర్ణ లైఫ్ లో చక్కగా సెటిల్ కానుంది. నటిగా కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూర్ణకు మంచి లైఫ్ పార్టనర్ దొరికాడు. వీరిది ప్రేమ వివాహమా లేక అరేంజ్డ్ మ్యారేజా అనే దానిపై క్లారిటీ లేదు..

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది