Poorna : పూర్ణ‌తో ఎఫైర్ గురించి అస‌లు విష‌యం చెప్పిన ర‌విబాబు.. అది చేయ‌డం వ‌స్తే ఇప్పుడు ఆమెతోనే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Poorna : పూర్ణ‌తో ఎఫైర్ గురించి అస‌లు విష‌యం చెప్పిన ర‌విబాబు.. అది చేయ‌డం వ‌స్తే ఇప్పుడు ఆమెతోనే…!

 Authored By ramu | The Telugu News | Updated on :6 June 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Poorna : పూర్ణ‌తో ఎఫైర్ గురించి అస‌లు విష‌యం చెప్పిన ర‌విబాబు.. అది చేయ‌డం వ‌స్తే ఇప్పుడు ఆమెతోనే...!

Poorna : సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప్ర‌ముఖుల గురించి నిత్యం సోష‌ల్ మీడియాలో ఎన్నో ప్ర‌చారాలు జ‌రుగుతూ ఉంటాయి. వారితో వీరు, వీరితో వారు ఎఫైర్స్ అంటూ పుకార్లు పుట్టిస్తుంటారు. పూర్ణ‌, ర‌విబాబుల మ‌ధ్య కొన్నాళ్లుగా ఎఫైర్ న‌డుస్తుంద‌నే ప్ర‌చారం ఎప్ప‌టి నుండో ఉంది. టాలీవుడ్ లో విలక్షణ డైరెక్టర్లలో ఒకడు రవిబాబు. అతడి సినిమాలు మొదటి నుంచీ రొటీన్ తెలుగు సినిమాలకు భిన్నంగా ఉండ‌డం మ‌నం చూశాం. అత‌ని సినిమాలు చాలా వరకూ ప్రేక్షకులను మెప్పించలేకపోయినా.. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ అనే ఫీల్ అయితే కల్పించాయి. మొదటి సినిమా అల్లరి కామెడీ జానర్ లో వచ్చినా.. తర్వాత అవును, అనసూయలాంటి హారర్ మూవీలు తీశాడు.రవి బాబుకు వీలైనంత తక్కువ బడ్జెట్‌లో ప్రాఫిట్ జోన్‌లో సినిమాలు తీయడం అలవాటు.

Poorna అవ‌న్నీ అవాస్త‌వాలు..

పూర్ణ విష‌యానికి వ‌స్తే.. అల్లరి నరేష్‌తో ‘సీమశాస్త్రి’ మూవీ ద్వారా టాలీవుడ్‌కు హీరోయిన్‌కు పరిచయమైంది. కానీ రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ‘అవును’ మూవీతోనే తనకు ఎక్కువ పాపులారిటీ లభించింది. అప్పటి నుంచి ప్రతి సినిమాలో పూర్ణను కంటిన్యూ చేస్తూ వస్తున్న రవి బాబు.. ఆ మధ్య వ‌చ్చిన‌ ‘అసలు’ మూవీలోనూ తననే తీసుకున్నాడు. అయితే పూర్ణ‌ని వ‌రుస సినిమాల‌లో కంటిన్యూ చేస్తుండ‌డందో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నే పుకార్లు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో ర‌విబాబు ప‌లుమార్లు వాటిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ర‌విబాబు.. ‘పూర్ణతో నాకున్న లవ్ ఎఫైర్ జనాలు అనుకునేది కాదు. విజువలైజ్ చేసుకున్న దాని కంటే 200% బెస్ట్ అవుట్‌పుట్‌ను అందించే ప్రత్యేక నటులను దర్శకులు సాధారణంగా ఎలాగైతే ఇష్టపడతారో ఇదీ అంతే. పూర్ణ కూడా అటువంటి జెమ్’ అంటూ చెప్పుకొచ్చారు.,

Poorna పూర్ణ‌తో ఎఫైర్ గురించి అస‌లు విష‌యం చెప్పిన ర‌విబాబు అది చేయ‌డం వ‌స్తే ఇప్పుడు ఆమెతోనే

Poorna : పూర్ణ‌తో ఎఫైర్ గురించి అస‌లు విష‌యం చెప్పిన ర‌విబాబు.. అది చేయ‌డం వ‌స్తే ఇప్పుడు ఆమెతోనే…!

ఇక ర‌విబాబు ప్ర‌స్తుతం రష్ అనే మూవీ చేస్తుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా జర్నలిస్ట్ జాఫర్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పూర్ణతో ఎఫైర్‌పై రియాక్ట్ అయ్యాడు. పాపం మీడియా వాళ్లు ఆ అమ్మాయితో లింక‌ప్ చేశారు. ఎక్కడో కేరళాలో ఉంటున్న ఆమెతో ఈ లింక్‌ ఎందుకంటే ఆమెతో నేను ఎక్కువగా సినిమాలు చేయడం వల్లే అని ర‌విబాబు చెప్పుకొచ్చారు . సోగ్గాడు సినిమాలో తరుణ్‌ తండ్రి పాత్రకి మా నాన్న చలపతిరావుని తీసుకుంటే బెటర్‌ అన్నారు. కానీ ఆయన సూట్‌ కాడని కోట శ్రీనివాసరావుని తీసుకున్నాను..పూర్ణ విషయంలో కూడా, నేను ఆల్వేస్ ఆ పాత్రకి ఆమె సూట్‌ అవుతుందా లేదా అనేదాన్ని బట్టే ఎంపిక చేశాను. నేను ఎప్పుడు ఆమెకి క్యారెక్టర్‌ ఇచ్చినా 100శాతం జస్టీస్‌ చేస్తుంది. టెర్రిఫిక్‌ పర్ఫెర్మర్‌. వన్‌ మోర్‌ అడగడానికి నేనే భయపడతాను. అంతటి డెడికేషన్‌తో, కాన్‌సన్‌ట్రేషన్‌తో షాట్‌ ఇస్తుంది. అందుకే ఆమెని అన్ని సార్లు తీసుకున్నాను. ఆమెకి ఫైట్‌ చేయడం వస్తే రష్‌ సినిమాలో ఆమెనే పెట్టేవాడిని.. ఆమెతో నాకు ఎలాంటి ఎఫైర్ లేద‌ని తెలియ‌జేశాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది