Poorna : పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయిందా.. ఎఫైర్ కార‌ణ‌మా?

Authored By Sam C | The Telugu News | Updated on : 3 August 2022, 1:00 pm

Poorna : అవును సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన‌ పూర్ణ ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో న‌టించి మెప్పించింది. అయితే సినిమాల ద్వారా పూర్ణ పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొంద‌లేక‌పోయింది. ఎప్పుడైతే ఢీ షోకి జ‌డ్జిగా వ‌చ్చిందో అప్ప‌టి నుండి పూర్ణ పేరు మారు మ్రోగింది. ఢీ షోలో ఆమెకు నచ్చితే బుగ్గ కొరికేస్తుంది. నచ్చకపోతే ముఖానే మీ పర్ ఫామెన్స్ బాగోలేదు అని చెప్పేస్తుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలిగిన ఈ బ్యూటీ.. అందానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది. నరేష్ హీరో గా అంటించిన సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ..నటన పరంగా టూ గుడ్ అనిపించుకుంది.

కెరియ‌ర్ మంచి పీక్స్ లో ఉన్ స‌మ‌యంలో పూర్ణ తాను పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైంది. ఇటీవ‌ల‌ ఆమె నిశ్చితార్ధం చేసుకుని ఓ ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లాడబోతున్నట్లుగా ఈ మధ్యనే తెలిపిన ఈ అమ్మడు..రీసెంట్ కోట్లు ఖర్చు చేసి నిశ్చితార్ధాని గ్రాండ్ గా చేసుకుంది. ‘కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను’ అంటూ కాబోయే భర్తతో దిగిన ఫొటోను కూడా షేర్‌ చేసింది.

poorna marriage cancelled

poorna marriage cancelled

అయితే పూర్ణ పెళ్లి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంద‌ని, ఇక న‌ట‌న‌కు కూడా గుడ్ బై చెప్ప‌నుంద‌ని జోరుగా ప్ర‌చారాలు న‌డుస్తున్న స‌మ‌యంలో సడెన్ గా ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తరువాత సినిమాలు చేసుకునే అవ‌కాశం కూడా ఆమె కాబోయే భ‌ర్త ఇచ్చిన కూడా పెళ్లి క్యాన్సిల్ అయింద‌ట‌. అందుకు కార‌ణం పూర్ణ ఓ డైరెక్టర్ తో ఎఫైర్ ఉందని తెలియడం అని అంటున్నారు. అది తెలుసుకొనే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అని గాసిప్ రాయుళ్లు తెగ ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో నిజం ఉందా, లేదా? దీనిపై పూర్ణ స్పందిస్తుందా అనేది చూడాలి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి