Poorna On Anchor Pradeep in Sridevi Drama Company
Poorna : హీరోయిన్ పూర్ణకు బుల్లితెరపై బాగానే క్రేజ్ వచ్చింది. వచ్చీ రానీ తెలుగుతో పూర్ణ నెట్టుకొస్తుంది. ఆమె అందాల ప్రదర్శన, హగ్గులు, ముద్దులు, బుగ్గలు కొరకడం వంటి పిచ్చి చేష్టలతో బాగానే ట్రోలింగ్‌కు గురైంది. ఢీ షోలో పూర్ణ చేసిన రచ్చకు ఆమెను బయటకు పంపించేసినట్టున్నారు. అయితే ఢీ షోలో ఉన్నప్పుడు పూర్ణకు, ప్రదీప్‌కు మధ్య ట్రాక్ వర్కవుట్ చేయాలని డైరెక్షన్ టీం నానా తంటాలు పడింది. పూర్ణ, ప్రదీప్ మధ్య పిచ్చి పిచ్చి పాటలు, స్టెప్పులు పెట్టేశారు. మొత్తానికి ఒకానొక సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందా? అనే అనుమానాలు వచ్చేలా చేశారు. ఇక తాజాగా పూర్ణ ఓ కామెంట్ చేసింది.
పూర్ణ ప్రస్తుతం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోకి వస్తోంది. ఢీ నుంచి పూర్ణ బయటకు వచ్చింది. ఇంద్రజ స్థానంలో శ్రీదేవీ డ్రామా కంపెనీకి వచ్చేసింది. అయితే ఆదివారం నాడు జరిగిన ఈవెంట్‌లో పూర్ణ నోరు జారింది. నాన్న నా హీరో అంటూ ఆదివారం నాడు జరిగిన షోలో రష్మీని ఆది ఏడిపించసాగాడు. రష్మీ ఏం చేసినా కూడా.. వెంటనే ఫోన్ మట్లాడుతున్నట్టుగా.. బాబు.. ఇప్పుడు పాప అదరగొట్టేసింది.. సెంటర్‌కు వెళ్లింది.. డ్యాన్స్ చేసింది అంటూ ఇలా లైవ్ అప్డేట్లు ఇచ్చేశాడు. అలా ఓ రెండు మూడు చోట్ల రష్మీని ఆడుకున్నాడు. బాబు అని చెప్పి సుధీర్ పేరుని కూడా పరోక్షంగా ఇందులోకి వాడేస్తున్నాడు ఆది.
Poorna On Anchor Pradeep in Sridevi Drama Company
అలా ఓ సారి రష్మీ మీద సెటైర్లు వేస్తూ..పూర్ణ మీద కూడా కౌంటర్లు వేస్తాడు. అయితే వెంటనే పూర్ణ రియాక్ట్ అవుతుంది. నా గురించి సుధీర్‌కి ఎందుకు చెబుతున్నావు.. ఆయనకు నాకు లింక్ ఏంటి.. నాకు ప్రదీప్‌తో లింక్ కదా? అని పూర్ణ నోరు జారింది. దీంతో అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వేస్తారు. అయితే ఇది పూర్ణ కావాలని అందో లేదా స్క్రిప్ట్ ప్రకారం అందో తెలియడం లేదు. మొత్తానికి ఇప్పుడు పూర్ణ, ప్రదీప్ జోడి మాత్రం అంతగా ట్రెండింగ‌్‌లో లేదు. అసలు ప్రదీప్ కూడా ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు. ఆ ఢీ షో తప్పా ఇంకేమీ చేయడం లేదు. పండుగ ఈవెంట్లు, స్పెషల్ షోల్లోనూ ఎక్కువగా సందడి చేయడం లేదు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.