Poorna : బుల్లితెరపై ఇమాన్యుయేల్ చేసే సందడి మామూలుగా ఉండదు. ఇక పూర్ణ సంగతి అయితే వేరే చెప్పనక్కర్లేదు. వచ్చీ రానీ తెలుగుతో ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుంది. తనకు వచ్చిన స్టెప్పులు వేస్తూ మ్యానేజ్ చేస్తుంది.అలా ఢీ షోలో కొన్ని రోజులు హల్చల్ చేసింది. అక్కడ కంటెస్టెంట్లు, డ్యాన్స్ మాస్టర్ల బుగ్గలు కొరికి తెగ హడావిడి చేసింది. అయితే ఇప్పుడు పూర్ణ శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు వచ్చింది. ఇంద్రజ స్థానంలో పూర్ణ వచ్చింది. అయితే పూర్ణ ఎంట్రీ రాగానే.. శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులంతా కూడా నా బుగ్గ కొరకండి అంటూ వెంటపడ్డారు. అదీ తన రేంజ్ అని పూర్ణ గుర్తించలేకపోయింది. పూర్ణ పరువు అందరూ కలిసి తీసేశారు.
అది పక్కన పెడితే.. ఓ స్కిట్లో ఇమాన్యుయేల్‌ను దారుణంగా అవమానించింది పూర్ణ. ఇమాన్యుయేల్ దగ్గరకు వచ్చి కూర్చుంటే.. స్నానం చేయలేదా?.. అని ముక్కు మూసుకుంటుంది. ఇందాక వాళ్లంతా కూడా ఉన్నా ఇలాంటి వాసన రాలేదు.. నువ్ వచ్చాకే వస్తోంది అంటూ ముక్కు మూసుకుని ఇమాన్యుయేల్ పరువుతీసింది పూర్ణ. దీంతో సెట్‌లో అందరూ కూడా అలానే చేశారు. ఇక ఏం టీం వద్దకు వెళ్లి కూర్చున్నా కూడా అలానే దూరం దూరంటూ పెట్టేశారు. దీంతో ఇమాన్యుయేల్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన టీం సభ్యులు కూడా తనను అసహ్యించుకున్నట్టుగా చేస్తారు. అవతలి టీంలో అయితే పవిత్ర, రోహిణిలు దారుణంగా కించపరుస్తుంటారు.
ఇక వర్ష అయితే వాంతులు చేసుకున్నట్టుగా యాక్షన్ చేస్తుంది. నువ్ మరీ అంత ఓవర్ చేయొద్దు.. నిన్నేదో చేశానని వాళ్లనుకుంటారు అని ఇమాన్యుయేల్ కౌంటర్ వేస్తాడు. దీంతొ వర్ష తెల్లమొహం వేస్తుంది. ఇక ఇలా లాభం లేదని ఇమాన్యుయేల్.. స్టూడెంట్‌ల మధ్యలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ స్టూడెంట్స్ సైతం అలానే లేచిపోతుంటారు. దీంతో ఇమాన్యుయేల్ మండిపడతాడు. ఇదంతా మీ వల్లే వచ్చిందంటూ పూర్ణ మీద కోపంతో ఊగిపోతాడు ఇమాన్యుయేల్. అలా మొత్తానికి పూర్ణ కామెడీగా అందో నిజంగానే అందో గానీ ఇమాన్యుయేల్‌కు మాత్రం అందరూ చుక్కలు చూపించారు.
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
This website uses cookies.