Acharya Movie
Acharya : మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ న్యూస్ ఇది. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ – మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్‌కి జంటగా కాజల్ అగర్వాల్.. చరణ్‌కి జంటగా హీరోయిన్ పూజా హెగ్డే కనిపించబోతోంది. రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుండగా ఇప్పటికే రిలీజైన లాహే లాహే సాంగ్ లో సంగీత కనిపించింది.
postponement of Acharya Movie release
అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఆచార్య సినిమాని దేశ వ్యాప్తంగా మే 13న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఆచార్య సినిమాని థియేటర్స్ లో చూస్తామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆచార్య సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. అందుకు కారణం ఆచార్య సినిమా షూటింగ్ ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉందట. అంతేకాదు వీఎఫెక్స్ వర్క్ కూడా ఇంకా చాలా వరకు పూర్తి కావాల్సి ఉందని సమాచారం.
దాంతో ఆచార్య పోస్ట్ పోన్ చేసేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ మిస్ అయితే మళ్ళీ సోలో డేట్ దొరకడం చాలా కష్టం. ప్రభాస్ రాధే శ్యాం సహా పలు భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆచార్య సినిమాకి మళ్ళీ సోలో డేట్ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి. ఇక త్వరలో బ్యాలెన్స్ టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన లాహే లాహే సాంగ్ సినిమా మీద భారీగా అంచనాలు క్రియేట్ చేసింది. ఇక త్వరలో ఆచార్య సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారట.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.