Adipurush : అనుకున్నదే నిజమైంది.. ‘ఆదిపురుష్’లో సీతగా ఎవరంటే?

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 12 March 2021, 9:04 am

Adipurush : ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు సలార్.. మరో వైపు ఆది పురుష్ సినిమా షూటింగ్‌లతో రచ్చ చేస్తున్నాడు. ఇంకో వైపు నాగ్ అశ్విన్ సినిమా పనులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ ముంబైలోనే ఉన్నాడు. అది కూడా ఆదిపురుష్ సినిమా చిత్రీకరణలో ఉన్నాడు. మామూలుగా ఈ మూవీ అప్డేట్లు అన్నీ కూడా ఉదయం పూటే వస్తుంటాయి.

అందులోనూ ఎవ్వరికీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బయటకు వదులుతుంటారు. అలా ప్రతీసారి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా మరో అప్డేట్‌ను ఇచ్చారు. ఇందులో సీత పాత్రను, లక్ష్మణుడి క్యారెక్టర్ పోషించే పాత్రధారులను గురించి తెలిపారు. అందరూ అనుకున్నట్టుగానే, లీకులు వచ్చినట్టుగానే సీత పాత్రలో కృతి సనన్ కనిపించబోతోందని అధికారికంగా చెప్పేశారు.

Prabhas Adipurush Sita And Lakshman Roles revealed

Prabhas Adipurush Sita And Lakshman Roles revealed

Adipurush :  ‘ఆదిపురుష్’లో సీతగా ఎవరంటే?

సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడు పాత్రలో సన్నీ సింగ్ నటించబోతోన్నట్టు ఆది పురుష్ టీం ప్రకటించింది. ఈ మేరకు ఓం రావత్, ప్రభాస్ ఇద్దరూ కూడా ఆ ఇద్దరిని చిత్రంలోకి సగర్వంగా స్వాగతించారు. ఈమేరకు ప్రస్తుతం ఆదిపురుష్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. మొత్తానికి ఆది పురుష్ మాత్రం విడుదలకు ముందే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక సైఫ్ అలీ ఖాన్ మాట్లాడిన మాటలు, ఆయన పోషించే రావణాసురుడి పాత్ర రెండూ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp