Prabhas : ఆస్తుల విషయంలో కృష్ణంరాజు భార్య తీసుకున్న నిర్ణయానికి షాక్ లో ప్రభాస్..??

Authored By Breaking News | The Telugu News | Published on: November 8, 2022, 6:20 pm

Prabhas : సెప్టెంబర్ 11వ తారీకు సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడం తెలిసిందే. హీరోగా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించినా ఆయన రాజకీయరంగంలో కూడా రాణించారు. ప్రధానిగా వాజ్ పాయ్ ఉన్న సమయంలో కేంద్ర రక్షణ మరియు విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. చలనచిత్ర రంగంలో ఎన్నో వైవిధ్యకరమైన పాత్రలు పోషించిన కృష్ణంరాజు మరణానికి కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎంతో కలత చెందారు. చివరిసారిగా ఆయన భౌతికకాయాన్ని చూడటానికి సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు మరియు అభిమానులు పోటెత్తారు.

ఇదిలాఉంటే కృష్ణంరాజు సంస్మరణ సభను ఆయన సంతూరు మొగల్తూరులో ప్రభాస్ మరియు కుటుంబ సభ్యులు చాలా ఘనంగా నిర్వహించడం తెలిసిందే. అభిమానులకు రకరకాల వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేయటం సంచలనం రేపింది. ఈ క్రమంలో కృష్ణంరాజు మరణంతో ఆయన సతీమణి శ్యామలాదేవి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే తమ కుటుంబానికి సంబంధించిన ఆస్తిపై పూర్తి అధికారాలు ప్రభాస్ కి వచ్చేలా వీలునామా రాయించిందట. అంతేకాదు చెల్లెళ్ల పెళ్లిళ్ల బాధ్యత పూర్తిగా ప్రభాస్ పైనే వేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇకనుండి తమ కుటుంబానికి పెద్దదిక్కు ప్రభాస్ అని శ్యామలాదేవి తన వీలునామాలో రాసినట్లు … సమాచారం. తనకి ఏది జరిగిన సరే ఆస్తి మొత్తం ప్రభాస్ కి చెందుతుందని తెలిపారుట.

prabhaS by the decision taken by krishna raju wife in the matter of property

prabhaS by the decision taken by krishna raju wife in the matter of property

ఈ నిర్ణయంతో కూతుర్లు అదేవిదంగా ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయినట్లు టాక్. కానీ కుటుంబ సభ్యులు మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నట్లు శ్యామలాదేవిని పొగిడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ వ్యక్తిత్వపరంగా ఏటువంటి ఆశించే వ్యక్తి కాదని, అటువంటి వ్యక్తి చేతిలో ఆస్తులు పెట్టడంతో పాటు కూతుర్ల భవిష్యత్తు పెట్టే రీతిలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తీసుకున్న నిర్ణయం కరెక్టనీ కుటుంబ సభ్యులు అంటున్నారట. ఇక తన పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ కి మంచి ఎఫెక్షన్ ఉండటం తెలిసిందే. వీరిద్దరూ కలిసి మూడు సినిమాలలో కూడా నటించడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తల్లి లాంటి శ్యామలాదేవి పెట్టిన బాధ్యతను నెరవేర్చే దిశగా చెల్లెళ్ల పెళ్లిళ్లపై మొదటిగా దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp