Radhey Shyam : రాధే శ్యామ్ లో ప్రభాస్ కాస్ట్లీ లవ్ స్టోరీ.. ఎన్ని ట్విస్టులో తెలిస్తే..

Authored By mallesh | The Telugu News | Published on: March 9, 2022, 1:30 pm

Radhey Shyam : ఒక‌ప్పుడు ప్రేమ క‌థ‌ల‌కు అంత‌గా బ‌డ్జెట్ ఖ‌ర్చు చేసేవాళ్లు కాదు. ల‌వ్‌స్టోరీస్కి భారీ సెట్లు వేయాల్సిన ప‌ని ఉండ‌దు. హీరో ఎలివేష‌న్ పెద్ద‌గా ఉండ‌దు. యాక్ష‌న్ సీన్లు అంతాగా ఉండ‌వు. సింపుల్‌గా త‌క్కువ బ‌డ్జెట్‌లో కంప్లీట్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలాకాదు. ల‌వ్‌స్టోరీస్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. పూర్తి స్థాయి ప్రేమ‌క‌థ‌కు కోట్లు ఖ‌ర్చు చేయ‌డం.. అది ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ న‌టించ‌డంతో రాధేశ్యామ్‌కు మంచి హైప్ వ‌చ్చింది. మూవీ ప్ర‌మోష‌న్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. ఇట్రెస్టింగ్ డైలాగ్స్ తో సినిమాపై మంచి మంచి హైప్ క్రీయేట్ అయింది. ఇప్ప‌టికే భారీ స్థాయిలో మార్కెట్ జ‌రిగింద‌ని అంచ‌నా..

కాగా డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఈనెల 11న రిలీజ్ కానుంది.అయితే రాధాకృష్ణ‌కు ఇది రెండో సినిమా. బాహుబ‌లి, సాహో లాంటి చిత్రాల త‌రువాత పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ను హ్యాండిల్ చేయ‌డం అందులో పూర్తి స్థాయి ప్రేమ‌క‌థా చిత్రం అవ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ట్రైల‌ర్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావ‌డంతో మంచి క్రేజ్ వ‌చ్చింది. పూర్తి స్థాయి ప్రేమ‌క‌థ చిత్రం పై ఏకంగా రూ. 300 కోట్ల బ‌డ్జెట్ కేటాయించి ఈ మూవీ కంప్లీట్ చేశారు. అయితే ఎక్కువ‌గా ప్రొడ్యూస‌ర్స్ భారీ యాక్ష‌న్ సినిమాల‌పై, రివేంజ్, బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల‌పై ఖ‌ర్చు చేస్తుంటారు. కానీ రాధేశ్యామ్ లాంటి పూర్తి స్థాయి ప్రేమ‌క‌థా చిత్రంపై భారీ స్థాయిలో ఖ‌ర్చు చేయడం సాదార‌ణ విష‌యం కాదు.

Prabhas Castly Love Story in Radhe Shyam

Prabhas Castly Love Story in Radhe Shyam

radhe shyam : రూ.300 కోట్ల బడ్జెట్..

అయితే యాక్ష‌న్ సినిమాల్లో గ్రాఫిక్స్, టెక్సీషియ‌న్స్ కి ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతుంది. మ‌రీ ప్రేమ క‌థా చిత్రాల్లో అంత‌గా ఎం ఖ‌ర్చు ఉంటుంద‌ని అనుకోవ‌చ్చు కానీ రాధేశ్యామ్ విష‌యానికి వ‌స్తే దాదాపు వంద‌కు పైగా సెట్స్ వేయ‌డం, యూర‌ప్‌లోని ఇట‌లీలో షూటింగ్ జ‌ర‌గ‌డంతో బ‌డ్జెట్ భారీగానే పెరుగుతుంది. అలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ మంచి హైప్ తీసుకొచ్చాయి. ప్ర‌భాస్‌, హీరోయిన్ పూజా హెగ్డేల స్టైల్, బ్యూటీ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నారు. అయితే మ‌రో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న రాధేశ్యామ్ క‌లెక్ష‌న్ల సూనామీ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తితో ఉన్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp