Prabhas : కాజల్ ని పోలిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ పై సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్ ..

Authored By aruna | The Telugu News | Published on: July 18, 2023, 6:00 pm

Prabhas : టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక అప్పటినుంచి ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ త్వరలోనే ప్రాజెక్ట్ కె సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి ఓ ఆసక్తికర వార్త ట్రెండ్ అవుతుంది.

ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఒకటే ‘ డార్లింగ్ ‘ సినిమా. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ నటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్గా తీసుకోవాలని సినిమా యూనిట్ అనుకున్నారట. అయితే ప్రభాస్ మాత్రం ఈ క్యారెక్టర్ కి రకుల్ ప్రీత్ సింగ్ సెట్ అవ్వదని, ఆమె చాలా ట్రెండీ, స్టైలిష్, మోడరన్ ఉమెన్ గా కనిపిస్తుందని, ఆమె ఫేస్ కొంచం మగరాయుడులా ఉంటుందని, ఆ కారణంగా ఈ పాత్రకి ఆమె అస్సలు సూట్ అవ్వదని ప్రభాస్ చెప్పుకొచ్చారట.

Prabhas comments about Rakul and Kajal

Prabhas comments about Rakul and Kajal

అందుకే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కి బదులుగా వేరే హీరోయిన్ నీ సెలెక్ట్ చేయండి అని చెప్పారట. ఈ క్రమంలోనే ఈ పాత్రకి హీరోయిన్ కాజల్ అగర్వాల్ అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని ఆమెను తీసుకున్నారట. అయితే అప్పట్లో ప్రభాస్ కావాలనే ఈ సినిమా నుంచి రకుల్ ప్రీత్ సింగ్ తొలగించాడని కామెంట్స్ వినిపించాయి. కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, డీలక్స్ రాజా, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోందిహ ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకులలో భారీ అంచనాలు నిలిపింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp