Prabhas : హీరోయిన్‌పై అనుమానం.. ప్రభాస్ కామెంట్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: March 4, 2021, 6:09 pm

Prabhas : ఆరడగుల అందగాడు అంటే ఎవ్వరైనా ప్రభాస్ వైపు చూడాల్సిందే. ప్రభాస్ హైట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కటౌట్ అలా నడిచి వస్తుంటే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి ప్రభాస్ ఓ హీరోయిన్ హైట్ చూసి షాక్ అయ్యాడు. జాతి రత్నాలు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ సందడి చేశాడు. జాతి రత్నాలు సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ కాసేపటి క్రితమే విడుదల చేశాడు. దానికోసం యూనిట్ ముంబైకి వెళ్లింది.

ముంబైలో ప్రభాస్ ఉంటోన్న ఇంటికి జాతిరత్నం టీం వెళ్లింది. అందులో ప్రియదర్శి, నవీన్ పొలిశెట్టి ఉన్నారు. అంతే కాకుండా హీరోయిన్ అయిన ఫరియా కూడా వెళ్లింది. అలా ఓ ఫన్నీ వీడియోను షూట్ చేసింది జాతిరత్నాలు టీం. అందులో ప్రభాస్ హీరోయిన్‌పై అనుకోని కామెంట్ చేశాడు. ఆమె హైట్ చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. అలా పక్కన నిల్చుంటే ప్రభాస్‌కు సరిజోడిగా సరిపోయింది.

prabhas

prabhas

Prabhas : హీరోయిన్‌పై అనుమానం.. ప్రభాస్ కామెంట్స్ వైరల్

ఈమె టాలెస్ట్ హీరోయిన్ అంటూ నవీన్ సెటైర్ వేశాడు. నిజంగానే ఇంత హైట్ ఉందా? అంటూ ప్రభాస్ అనుమానం వ్యక్తం చేశాడు. హీల్స్ వంటివి ఏమైనా వేసుకుందా? అంటూ అడిగేశాడు. మొత్తానికి జాతి రత్నాలు టీం ప్రభాస్‌తో చేసిన చిట్ చాట్ బాగానే క్లిక్ అయింది. వచ్చే వారం విడుదల కాబోతోన్న జాతి రత్నాలు మూవీపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.ఇక ఈ మూవీఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp