'రాధే శ్యామ్ ' విషయంలో రగిలిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

‘రాధే శ్యామ్’ విషయంలో రగిలిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్..?

 Authored By govind | The Telugu News | Updated on :14 January 2021,2:34 pm

‘రాధే శ్యామ్’ సినిమా గురించి దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్ సినిమా.. అద్భుతమైన పీరియాడికల్ లవ్ స్టోరీ.. ఇప్పటి వరకు ప్రభాస్ నుంచి రాని రొమాంటిక్ సినిమా.. ఇలా చాలా విషయాలు చెప్పి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు దర్శక నిర్మాతలు. ఇక ప్రభాస్ కి జంటగా మోస్ట్ వాంటెడ్ హాట్ హీరోయిన్ పూజా హెగ్డే నటించడం మరొక ఆసక్తికరమైన విషయం. బీట్స్ ఆఫ్ ‘రాధే శ్యామ్’ మోషన్ టీజర్ లో సలీం – అనార్కలీ… దేవదాసు – పార్వతీ – లైలా – మజ్ఞు లను చూపించి ఇంకాస్త ఆతృత పెంచారు.

Always Prabhas Fc ™ on Twitter: "#VikramAditya - Prerana ❤️ ???? Thank you  @director_radhaa , @kabilanchelliah , @storyteller_ind ???? ???? ???? #Prabhas  #RadheShyam… https://t.co/Ytf0g3zscj"

ఇంతమంది ప్రేమ జంటలను బీట్స్ ఆఫ్ ‘రాధే శ్యామ్’లో చూపించేసరికి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా టీజర్ ని చూస్తామాని అని ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ కి ‘రాధే శ్యామ్’ నుంచి టీజర్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసి దెబ్బైపోయారు. అయితే దర్శకుడు రాధకృష్ణ ‘రాధే శ్యామ్’ నుంచి త్వరలో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో తెలిపాడు. దాంతో కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతీ ఒక్కరు ‘రాధే శ్యామ్’ నుంచి రొమాంటిక్ టీజర్ వస్తుందని భావించారు. అంతేకాదు వకీల్ సాబ్ టీజర్ తో ‘రాధే శ్యామ్’ ని పోటీగా భావించి ఏ సినిమా టీజర్ ఎలా ఉంటుందో అంటూ చర్చలు జరుపుతున్నారు.

Vakeel Saab, Radhe Shyam, Naarappa, Virataparvam, and Acharya - Raining  Teasers for Sankranthi 2021

కాని సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ మాత్రమే వస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. కాని ‘రాధే శ్యామ్’ నుంచి టీజర్ రావడం లేదని లేటెస్ట్ అప్‌డేట్. మళ్ళీ ‘రాధే శ్యామ్’ టీం డార్లింగ్ ఫ్యాన్స్ ని దారుణంగా డిసప్పాయింట్ చేసిందని అంటున్నారు. మరి ఈరోజు ‘రాధే శ్యామ్’ నుంచి టీజర్ రాకపోతే మళ్ళీ ఆ స్పెషల్ డే ఎప్పుడన్నది చెప్పలేము అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. కాగా ప్రభాస్ సలార్ 15 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. అంతేకాదు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవబోతుంది.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది