
prabhas get new car worth rs 6 crore
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్. ఆయనకున్న క్రేజ్..మార్కెట్ టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ స్టార్ హీరోలకి లేదని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటే 300 కోట్లు కనీసం టేబుల్ మీద పెట్టుకొని నిర్మాత రెడీగా ఉండాల్సిందే. డార్లింగ్ చేతిలో ఇప్పుడు నాలుగు పాన్ ఇండియన్ సినిమాలున్నాయి. రాధే శ్యాం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది.
అలాగే ప్రస్తుతం సెట్స్ మీద ఆదిపురుష్ సినిమా.. సలార్ సినిమా ఉన్నాయి. ఆదిపురుష్ సినిమాతో స్ట్రైట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. కృతి సనన్ సీతగా .. సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా 2022 ఆగస్టు 11న భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇక కేజీఎఫ్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నారు.
prabhas get new car worth rs 6 crore
ఇక వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా ఈ ఏడాది సెట్స్ మీదకి రాబోతోంది. ఇలాంటి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్. ఆయన ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ 100 కోట్లని టాక్. మరి అంత రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్ ఎలాంటి లైఫ్ స్టైల్ మేయింటైన్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
prabhas get new car worth rs 6 crore
అందుకు ఉదాహరణ తాజాగా ప్రభాస్ కొన్న కొత్త కారే. లంబోర్ఘిని అవెన్‌టోడోర్ ఎస్ రోడ్‌స్టర్‌ను రీసెంట్ గా కొన్నాడు. అరాంచో అట్లాస్ షేడ్ కలర్ కారు తీసుకున్నారు. దీని ఖరీదు దాదాపు రూ. 7 కోట్లని తెలుస్తోంది. ఇక ఇండియాలోనే ఈ కారు కొన్న రెండవ వ్యక్తి ప్రభాస్ కావడం విశేషం. బెంగళూరులోని లంబోర్ఘిని షోరూమ్ నుంచి ఈ కారును ఇటీవలే హైదరాబాద్‌లోని ప్రభాస్ ఇంటికి డెలివరీ చేశారు. వచ్చీ రాగానే ఈ కారుతో హైదరాబాద్ రోడ్లు మీద డార్లింగ్ చక్కర్లు కొట్టాడు కూడా.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.