సాధారణంగా కుంభరాశిలో గురువు మంచి ఫలితాలు వస్తాయి. సంపదను, ఆరోగ్యాన్ని ఇస్తాడు. గురువు కుంభరాశి ప్రవేశాన్ని పాజిటివ్ ట్రాన్సిట్గా చెప్పుకోవచ్చు. వాయుతత్వం కల గురువు, వాయుతత్వమైన కుంభరాశిలో రావడం మంచి పరిణామంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరికి అయితే గురు,శని మహర్ధశలు జరుగుతున్నాయో వారికి మంచి ఫలితాన్నిస్తాడు. అదేవిధంగా గురువు ఎవరికి అయితే వారి రాశి నుంచి 1, 4, 7, 10 కేంద్రస్థానాల్లో ఉన్నాడో వారికి అనుకూలైమన సమయంగా చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా వృషభరాశి, సింహరాశి వృశ్చికరాశి, కుంభరాశి వారికి అనుకూలమైన సమయం. అదేవిధంగా మిగిలిన రాశులవారికి కలిగే ఫలితాల కోసం తెలుసుకుందాం..
11వ ఇంట గురువు ఉంటాడు. అంటే ఏకాదశ స్థానం. శుభస్థానం. దీనివల్ల మంచిగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు, ఆరోగ్యం, వాహన యోగం, ఏ రకంగానైనా లాభదాయకం, దాదాపు ఐదునెలల పదిహేను రోజులు మంచిగా ఉంటుంది.
వృషభరాశి- అనేక నెలల తర్వాత అనుకూలమైన స్థానంలో అంటే దశమస్థానంలోగురువు గోచరిస్తాడు. అత్యంత శుభప్రదం. ఉద్యోగాలు రావడం, ప్రమోషన్, మంచి అనుకూలత కలిగిన సమయంగా దీన్ని అభివర్ణించవచ్చు. ముఖ్యమైన పనులను ఈ కాలంలో చేసుకుంటే తప్పక విజయం లభిస్తుంది. మిథునరాశి – వీరికి 9 వ ఇంట్లో గురువు ఉంటాడు. దీనివల్ల ఉన్నత విద్య, కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, భాగస్వామ్య పెట్టుబడులు, సంతానం, స్పెక్యులేషన్ కలసివస్తాయి, కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి.
ఈరాశివారికి 8 అంటే అష్టమ స్థానంలో గురువు ఉండటం జరుగుతుంది. వీరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం. కానీ ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఈ సమయంలో ఇల్లు మారడం జరుగుతుంది. కొన్ని విజయాలు సాధిస్తారు.
సింహరాశి – ఈరాశికి ఏడవ ఇంట గురువు ఉంటాడు. ఈరాశిలో వివాహం కానీ వారికి వివాహ యోగం, ఆరోగ్య సమస్యలు పోతాయి, ధనం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏప్రిల్ 6 నుంచి అనుకూలత, వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. అనుకూలత, ఆర్థికంగా బాగుంటుంది, ఆశయసాధనకు అత్యంత అనకూలమైన సమయం.
వీరికి గురవు 6వ ఇంట ఉంటాడు. ఈరాశివారి తల్లి ఆరోగ్యం ఇబ్బందులు, ఇంటి విషయాలు జాగ్రత్త, అప్పులు బాధలు పెరిగే అవకాశం, ఆరోగ్యం జాగ్రత్త, కెరీర్ బాగుటుంది, పని వత్తిడి ఉంటుంది.తులారాశి- వీరికి 5వ ఇంట ఉంటాడు. వీరికి ఈ ఆరునెలలు అదృష్టం బాగుంటుంది. ప్రతి పనిలో విజయం, మంచి ఫలితాలు, సంతాన యోగం, విద్య, లక్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది, ఆరోగ్య సమస్యలు పోతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మంచి రోజులు చూస్తారు.
ఈరాశివారికి 4వ ఇంట గురువు ఉంటాడు. చాలా బాగుంటుంది, కొత్త వస్తువులు, వాహనాలు, ఇండ్లు కొనే అవకాశం. తల్లితో చాలా సఖ్యతగా ఉంటారు. కెరీర్ బాగుంటుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇన్వెస్టెమెంట్ కలసి వస్తుంది.
ధనుస్సురాశి – వీరికి 3వ ఇంట ఉంటాడు. సామాన్యం గా ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. బంధువులతో సఖ్యత, కెరీర్ ఓకే. మీడియా వారికి చాలా బాగుంటుంది. క్రీడాకారులకు బాగుంటుంది, దైర్యం పెరుగుతుంది. వివాదాలు పరిష్కారం బాగుంటుంది. పాజిటివ్గా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
ఈరాశి వారికి 2వ ఇంట గురువు ఉంటాడు. అదృష్టం కలుగుతుంది, మంచి వ్యాపార లాభాలు, వివాదాలు పరిష్కారం, వస్తు, గృహయోగం, కోరుకున్న ఉద్యోగాలు, ధనం పెరగుతుంది, కుటుంబం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం, ఫారెన్ సోర్సెస్ ద్వారా ధన ప్రాప్తి, కొంచెం నష్టాలు రావచ్చు, వృత్తి బాగుంటుంది.
వీరికి 1వ ఇంట గురువు. మీ వ్యక్తిత్వవం, ఆరోగ్యం జాగ్రత్త, వివాహ సూచన, మీ గురించి ఆలోచిస్తారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు, విద్య, ఉన్నత విద్య, ట్రావెల్ చేస్తారు, పాజిటివ్గా ఉంటుంది.
ఈరాశి వారికి 12వ ఇంట గురువు. సుదూర ప్రాంతాలుకు వెళ్తారు, కెరీర్ కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. కొత్త ఇంటికి మారుతారు, ఆధ్యాత్మికత పెరుగుతుంది, మెడిటేషన్, యోగా చేయడం చాలా బాగుంటుంది. సమస్యలు అధిగమిస్తారు, ఆరోగ్య సమస్యలు పోతాయి. ఇలా ఆయా రాశుల వారికి గురువు సుమారు ఆరునెలల పాటు కుంభరాశిలో పైన పేర్కొన్న ఫలితాలను ఇస్తాడు. అనుకూలంగా ఉన్నవారు, లేనివారు కూడా ప్రతి గురువారం గురు ఆరాధన, పసుపు రంగు లేదా బంగారు రంగు దుస్తులు వేసుకోవడం, పేదలకు దానం, గురువులు, పండితులను గౌరవించడం వంటి పనులు చేయడం, హయగ్రీవ, దక్షిణామూర్తి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం చేస్తే అత్యంత లాభదాయకమైన ఫలితాలను గురువు ఇస్తాడు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.