Prabhas Kalki 2898AD : గురువారం రిలీజ్ అవ్వబోతున్న కల్కి సినిమా విధ్వంసానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ స్టామినా ఏంటో చూపించేలా మరోసారి కల్కి బాక్సాఫీస్ ప్రభంజనం చూసేందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటుగా కామన్ ఆడియన్స్ కూడా రెడీ అవుతున్నారు. ఓవర్సీస్ లో కూడా కల్కి ప్రీ బుకింగ్స్ అదిరిపోతుండగా తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే టికెట్స్ అన్నీ హాటు కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో అయితే మరో సినిమాకు ఛాన్స్ లేదన్నట్టుగా కల్కి విధ్వంసం సృష్టిస్తుంది.
అంతేకాదు దాదాపు అన్ని మల్టీప్లెక్స్ లు కల్కి భారీ షోలు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ ఏ.ఎం.బి థియేటర్ లో కల్కి కోసం 40 షోలు ఏర్పాటు చేస్తున్నారట. ఆ మల్టీప్లెక్స్ లో ఇన్ని షోస్ ఒక సినిమాకు రెడీ చేయడం ఇదే మొదటిసారి. మహేష్ సినిమాలకు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు. మరోపక్క ప్రసాద్ ఐమాక్స్ లో కూడా 36 షోస్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇలా మొదటిరోజు కల్కి సాధ్యమైనంత వరకు రికార్డు కలెక్షన్స్ రాబట్టేలా పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు. మహేష్ ఏ.ఎం.బి మల్టీప్లెక్స్ లో ఒక్కరోజే 40 షోస్ అంటే దాదాపు అక్కడే వసూళ్ల జాతర కనిపించేలా ఉంది. ఇక మిగతా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కూడా హంగామా అదే రేంజ్ లో ఉంది. ఏపీ తెలంగాణాలో ఆల్రెడీ పెంచిన టికెట్ రేట్ల వల్ల ప్రభాస్ కల్కి నభూతో న భవిష్యత్ అనిపించేలా ఫస్ట్ డే వసూళ్లు సాధించే పరిస్థితి కబడుతుంది.
కల్కి రిలీజ్ సందర్భంగా ప్రతి ఒక రెబల్ స్టార్ ఫ్యాన్ సినిమాకు సాధ్యమైనంత రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. చిత్రయూనిట్ కూడా సినిమా కచ్చితంగా ఒక అద్భుతమైన విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని బల్ల గుద్ది చెబుతున్నారు. మరి కల్కి మరికొద్దిగంటల్లో రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సినిమాలో ప్రభాస్ ఒక్కడే కాదు అమితాబ్, కమల్, దీపికా లాంటి స్టార్స్ అంతా వారి బెస్ట్ అందించడం వల్ల సినిమాపై మరింత బజ్ పెరిగింది.
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
This website uses cookies.