Prabhas Kalki 2898AD : ఒక్క AMB లోనే 40 షోలు.. కల్కి కోసం మల్టీప్లెక్స్ లు అన్ని భారీ ప్లాన్స్.. బాబోయ్ చరిత్రలో ఎప్పుడు లేనిది ఇప్పుడిలా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas Kalki 2898AD : ఒక్క AMB లోనే 40 షోలు.. కల్కి కోసం మల్టీప్లెక్స్ లు అన్ని భారీ ప్లాన్స్.. బాబోయ్ చరిత్రలో ఎప్పుడు లేనిది ఇప్పుడిలా..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas Kalki 2898AD : ఒక్క AMB లోనే 40 షోలు.. కల్కి కోసం మల్టీప్లెక్స్ లు అన్ని భారీ ప్లాన్స్.. బాబోయ్ చరిత్రలో ఎప్పుడు లేనిది ఇప్పుడిలా..!

Prabhas Kalki 2898AD : గురువారం రిలీజ్ అవ్వబోతున్న కల్కి సినిమా విధ్వంసానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ స్టామినా ఏంటో చూపించేలా మరోసారి కల్కి బాక్సాఫీస్ ప్రభంజనం చూసేందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటుగా కామన్ ఆడియన్స్ కూడా రెడీ అవుతున్నారు. ఓవర్సీస్ లో కూడా కల్కి ప్రీ బుకింగ్స్ అదిరిపోతుండగా తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే టికెట్స్ అన్నీ హాటు కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో అయితే మరో సినిమాకు ఛాన్స్ లేదన్నట్టుగా కల్కి విధ్వంసం సృష్టిస్తుంది.

అంతేకాదు దాదాపు అన్ని మల్టీప్లెక్స్ లు కల్కి భారీ షోలు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ ఏ.ఎం.బి థియేటర్ లో కల్కి కోసం 40 షోలు ఏర్పాటు చేస్తున్నారట. ఆ మల్టీప్లెక్స్ లో ఇన్ని షోస్ ఒక సినిమాకు రెడీ చేయడం ఇదే మొదటిసారి. మహేష్ సినిమాలకు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు. మరోపక్క ప్రసాద్ ఐమాక్స్ లో కూడా 36 షోస్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇలా మొదటిరోజు కల్కి సాధ్యమైనంత వరకు రికార్డు కలెక్షన్స్ రాబట్టేలా పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు. మహేష్ ఏ.ఎం.బి మల్టీప్లెక్స్ లో ఒక్కరోజే 40 షోస్ అంటే దాదాపు అక్కడే వసూళ్ల జాతర కనిపించేలా ఉంది. ఇక మిగతా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కూడా హంగామా అదే రేంజ్ లో ఉంది. ఏపీ తెలంగాణాలో ఆల్రెడీ పెంచిన టికెట్ రేట్ల వల్ల ప్రభాస్ కల్కి నభూతో న భవిష్యత్ అనిపించేలా ఫస్ట్ డే వసూళ్లు సాధించే పరిస్థితి కబడుతుంది.

Prabhas Kalki 2898AD ఒక్క AMB లోనే 40 షోలు కల్కి కోసం మల్టీప్లెక్స్ లు అన్ని భారీ ప్లాన్స్ బాబోయ్ చరిత్రలో ఎప్పుడు లేనిది ఇప్పుడిలా

Prabhas Kalki 2898AD : ఒక్క AMB లోనే 40 షోలు.. కల్కి కోసం మల్టీప్లెక్స్ లు అన్ని భారీ ప్లాన్స్.. బాబోయ్ చరిత్రలో ఎప్పుడు లేనిది ఇప్పుడిలా..!

కల్కి రిలీజ్ సందర్భంగా ప్రతి ఒక రెబల్ స్టార్ ఫ్యాన్ సినిమాకు సాధ్యమైనంత రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. చిత్రయూనిట్ కూడా సినిమా కచ్చితంగా ఒక అద్భుతమైన విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని బల్ల గుద్ది చెబుతున్నారు. మరి కల్కి మరికొద్దిగంటల్లో రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సినిమాలో ప్రభాస్ ఒక్కడే కాదు అమితాబ్, కమల్, దీపికా లాంటి స్టార్స్ అంతా వారి బెస్ట్ అందించడం వల్ల సినిమాపై మరింత బజ్ పెరిగింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది