Home » Entertainment » Anushka Suffering With A Serious Disease
Entertainment

Anushka : ఆ ఫీలింగ్ అనిపిస్తే చాలు సెట్ లో అందరి ముందు అలా చేస్తున్న అనుష్క..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 25, 2024, 8:00 pm
Advertisement

Anushka : స్వీటీ అనుష్క ఒక వింత జబ్బుతో బాధపడుతుందని మీకు తెలుసా. అదేంటి అనుష్కకు జబ్బా ఏంటి ఆమె సైజ్ జీరో కోసం లావెక్కడం కూడా జబ్బేనా అందుకోసమేగా అమ్మడు మళ్లీ తన పాత లుక్ కోసం సినిమాలు కూడా చేయట్లేదు. అయినా అది జబ్బు ఎలా అవుతుంది. సినిమాలో పాత్ర కోసం అలా బరువు పెరిగింది. ఐతే తగ్గడం కోసం కాస్త ఎక్కువ టైం తీసుకుంది అయినంత మాత్రాన అమ్మడికి ఏదో జబ్బు ఉందంటారా అంటే. అనుష్క కు ఉన్న జబ్బు లావెక్కడం కాదు అతిగా నవ్వడమని అంటున్నారు ఆమెకు బాగా పరిచయం ఉన్న వారు.

Advertisement

ఎంత పెద్ద సెట్ లో ఉన్నా సరే.. అక్కడ ఎంత సీరియస్ సీన్ జరుగుతున్నా సరే తనకు కామెడీ ఫీలింగ్ కలిగితే చాలు పకపకా నవ్వేస్తుందట అనుష్క. అదిసరే నవ్వడం కూడా ఒక రోగం అంటే ఎలా.. ఎంత నవ్వితే అంత ఆరోగ్యం అంటారు కదా అంటే నవ్వడం మంచిదే కానీ కంట్రోల్ చేయలేనంత నవ్వడం మాత్రం నష్టమే. అనుష్క అలా నవ్వడం మొదలు పెడితే దాదాపు పావు గంట దాకా నవ్వుతూనే ఉంటుందట. ఒక్కోసారి ఇంకా ఎక్కువ టైం కేవలం నవ్వడం కోసం తీసుకుంటుందట.

Anushka : ఆ ఫీలింగ్ అనిపిస్తే చాలు సెట్ లో అందరి ముందు అలా చేస్తున్న అనుష్క..!

Advertisement

ఆమెతో నవ్వడం పోటీ పడితే ఎవ్వరు గెలవలేరని అంటున్నారు కొందరు. ఐతే ఇలా నవ్వడం అనేది ఒక రోగమని అంటున్నారు. సూడో బుల్బార్‌ ఎఫెక్ట్(పీబీఏ) అంటే నాడీ వ్యవస్థలో లోపం వల్ల ఇలా అతిగా నవ్వడం లేదా ఏడవడం మొదలు పెడితే అతిగా ఏడవడం చేస్తారట. తనకు తెలియకుండానే అనుష్క ఇంత సీరియస్ జబ్బుతో బాధపడుతుందని అంటున్నారు నెటిజన్లు.ఇక ప్రస్తుతం అనుష్క సినిమాల విషయానికి వస్తే క్రిష్ డైరెక్షన్ లో ఘాటి సినిమా చేస్తున్న అనుష్క మరోపక్క మలయాఓళంలో కూడా క్రేజీ ఆఫర్ అందుకుంది. ఈ రెండు సినిమాలు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు అవ్వడం విశేషం. తప్పకుండా ఈ రెండు ప్రాజెక్ట్ లతో అనుష్క తిరిగి ఫాం లోకి వస్తుందని ఆమె ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి