Jr NTR : ఒక్కోసారి తమకు వచ్చిన అవకాశాలని కొందరు హీరోలు వదులుకుంటారు. ఆ అవకాశం వేరే హీరో చింతకు వెళ్లడంతో వారు సూపర్ హిట్ కొడుతుంటారు. అలాంటి సంఘలన ప్రభాస్, ఎన్టీఆర్ విషయంలో జరిగింది.ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అశ్వినీదత్ రీసెంట్‌గా సీతా రామం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించి.. అందరి ప్రశంసలు అందుకున్నారు ఈ టాప్ ప్రొడ్యూసర్. తాజాగా అలీతో సరదాగా షోకు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.
”మా లోగోలో కృష్ణుడి రూపంలో రామారావు ఫొటో ఉంటుంది. నేను ఎప్పటికీ రామారావు గారిని దైవంగానే భావిస్తా. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ కథ నా ఇద్దరు కూతుళ్లు విని.. చాలా బాగుంది తీద్దామన్నారు. ఇప్పటికే చాలా పొగట్టారు.. నాకంటే ఎక్కువ పొగొట్టేలా ఉన్నారని అన్నాను. హిందీలో ఫస్ట్ సినిమా పెళ్లి సందడి తీశా. ఆ తరువాత అనిల్ కపూర్‌తో చూడాలని వుంది సినిమాను నేను అరవింద్ గారితో కలిసి తీశాం. ఈ సినిమాకు మాకు మంచి కానుకలు వచ్చాయి. ఒక్కొక్కరికి రూ.6 కోట్ల నష్టం వచ్చింది. స్టూడెంట్ నెం.1 సినిమాను తారక్‌తో తీద్దామా.. లేక ఇంకా ఎవరినైనా తీసుకుందామా అని ఆలోచిస్తున్నాం.
ప్రభాస్ అయితే బాగుంటుందని అనిపించింది. ప్రభాస్‌కు చెప్పేలోపల హరికృష్ణ గారు ఫోన్ చేశారు. అటు తిరిగి.. ఇటు తిరిగి తారక్ వద్దకు వచ్చింది. టీడీపీలో మెంబర్‌గానే మెలిగాను తప్పా.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పార్ట్-2 నా లాస్ట్ మూవీ అని మైండ్‌లో ఫిక్స్ అయిపోయా. ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ 55 శాతం పూర్తయింది. ఇప్పుడు ఈ షెడ్యూల్ ఉంటే.. ఏ స్ట్రైక్ ఉన్నా కచ్చితంగా షూటింగ్ నిర్వహించేవాళ్లం. శక్తి సినిమాతో నాలో శక్తి విహీనం వచ్చిందేమో అనిపించింది. రజనీకాంత్ గారు చెప్పిన మాట వినకపోవడం.. నా భార్య చెప్పిన మాట వినకపోవడం.. చాలా బాధించింది..’ అంటూ అశ్వనీదత్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.