Jr NTR : ప్ర‌భాస్ ఛాన్స్ వ‌దులుకున్నాడు.. ఎన్టీఆర్ భారీ హిట్ కొట్టాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : ప్ర‌భాస్ ఛాన్స్ వ‌దులుకున్నాడు.. ఎన్టీఆర్ భారీ హిట్ కొట్టాడు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :12 August 2022,3:40 pm

Jr NTR : ఒక్కోసారి త‌మ‌కు వ‌చ్చిన అవకాశాల‌ని కొంద‌రు హీరోలు వ‌దులుకుంటారు. ఆ అవ‌కాశం వేరే హీరో చింత‌కు వెళ్ల‌డంతో వారు సూప‌ర్ హిట్ కొడుతుంటారు. అలాంటి సంఘ‌ల‌న ప్రభాస్, ఎన్టీఆర్ విష‌యంలో జ‌రిగింది.ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీద‌త్ తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అశ్వినీద‌త్ రీసెంట్‌గా సీతా రామం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించి.. అందరి ప్రశంసలు అందుకున్నారు ఈ టాప్ ప్రొడ్యూసర్. తాజాగా అలీతో సరదాగా షోకు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.

Jr NTR : క్రేజీ న్యూస్..

”మా లోగోలో కృష్ణుడి రూపంలో రామారావు ఫొటో ఉంటుంది. నేను ఎప్పటికీ రామారావు గారిని దైవంగానే భావిస్తా. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ కథ నా ఇద్దరు కూతుళ్లు విని.. చాలా బాగుంది తీద్దామన్నారు. ఇప్పటికే చాలా పొగట్టారు.. నాకంటే ఎక్కువ పొగొట్టేలా ఉన్నారని అన్నాను. హిందీలో ఫస్ట్ సినిమా పెళ్లి సందడి తీశా. ఆ తరువాత అనిల్ కపూర్‌తో చూడాలని వుంది సినిమాను నేను అరవింద్ గారితో కలిసి తీశాం. ఈ సినిమాకు మాకు మంచి కానుకలు వచ్చాయి. ఒక్కొక్కరికి రూ.6 కోట్ల నష్టం వచ్చింది. స్టూడెంట్ నెం.1 సినిమాను తారక్‌తో తీద్దామా.. లేక ఇంకా ఎవరినైనా తీసుకుందామా అని ఆలోచిస్తున్నాం.

Prabhas Left Student no1 movie Jr NTR Gets HIT

Prabhas Left Student no.1 movie Jr NTR Gets HIT

ప్రభాస్ అయితే బాగుంటుందని అనిపించింది. ప్రభాస్‌కు చెప్పేలోపల హరికృష్ణ గారు ఫోన్ చేశారు. అటు తిరిగి.. ఇటు తిరిగి తారక్ వద్దకు వచ్చింది. టీడీపీలో మెంబర్‌గానే మెలిగాను తప్పా.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పార్ట్-2 నా లాస్ట్ మూవీ అని మైండ్‌లో ఫిక్స్ అయిపోయా. ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ 55 శాతం పూర్తయింది. ఇప్పుడు ఈ షెడ్యూల్ ఉంటే.. ఏ స్ట్రైక్ ఉన్నా కచ్చితంగా షూటింగ్ నిర్వహించేవాళ్లం. శక్తి సినిమాతో నాలో శక్తి విహీనం వచ్చిందేమో అనిపించింది. రజనీకాంత్ గారు చెప్పిన మాట వినకపోవడం.. నా భార్య చెప్పిన మాట వినకపోవడం.. చాలా బాధించింది..’ అంటూ అశ్వనీదత్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది