Prabhas Marriage : హమ్మయ్య.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె తో ప్రభాస్ పెళ్లి
ప్రధానాంశాలు:
Prabhas Marriage : హమ్మయ్య.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె తో ప్రభాస్ పెళ్లి
Prabhas Marriage : ప్రభాస్ పెళ్లి వార్తలు మరోసారి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రతి సంవత్సరం అతని పెళ్లి గురించి ఎన్నో రూమర్లు వస్తూనే ఉంటాయి. కానీ ఈసారి జాతీయ మీడియా నుంచి వచ్చిన వార్తలు మరింత ఉత్కంఠ కలిగిస్తున్నాయి. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ వివాహం చేసుకోనున్నాడని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని ప్రచారం ఊపందుకుంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారి భార్య స్వయంగా పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Prabhas Marriage : హమ్మయ్య.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె తో ప్రభాస్ పెళ్లి
Prabhas Marriage ప్రభాస్ కు కాబోయే భార్య ఆమెనేనా..?
ఈ సమ్మర్ లోనే పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని, ఏప్రిల్ లేదా మే నెలలో ఇది పూర్తి అయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా పెళ్లికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. “ది రాజా సాబ్,” “ఫౌజీ,” “స్పిరిట్” వంటి భారీ సినిమాలు ఆయన చేతిలో ఉన్నప్పటికీ, వాటి మధ్య గ్యాప్ లోనే వివాహం జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంట్లో పెద్దలు పెళ్లిని ఆలస్యం చేయొద్దని గట్టిగా చెప్పడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నది సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో అనుష్క, కృతిసనన్ లాంటి పలువురితో ప్రభాస్ పెళ్లి అంటూ అనేక రూమర్లు వచ్చాయి కానీ, అవన్నీ ప్రచారంగానే మిగిలిపోయాయి. అయితే ఈసారి జాతీయ మీడియా వరకు ఈ వార్త రావడంతో, ఇది నిజమేననే అభిప్రాయం అందరిలో కలుగుతుంది.