Prabhas Movie : బ్రేకింగ్ : ఆగిపోయిన ప్రభాస్ సినిమా ??

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 8 May 2023, 10:00 am

Prabhas Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్. అవును.. బాహుబలి తర్వాత సరైన హిట్ లేక ప్రభాస్ చాలా టెన్షన్ పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయితే ఆ తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు అంతలా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దానికి కారణాలు అనేకం. ఏది ఏమైనా ప్రభాస్ చేతుల్లో ఇప్పటికీ బోలెడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు ఇతర సినిమాల షూటింగ్ లలోనూ బిజీగా గడిపేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్ తో ఒక పాన్ ఇండియా సినిమా తీయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకు పఠాన్ మూవీ డైరెక్టర్ ను తీసుకోవాలని అనుకున్నారు. సిద్ధార్థ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని చెప్పారు. ఈ సినిమా కూడా హైబడ్జెట్ తో రాబోతుందని ప్రకటించారు. ఈ సినిమా కోసం పారితోషికాలు మాట్లాడుకోవడం కూడా అయింది. సిద్ధార్థ్ కు రూ.75 కోట్ల పారితోషికం ఇస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ఒప్పుకున్నారు. అన్నీ ఓకే.. ఇక పట్టాలెక్కడమే లేట్ అని అనుకుంటున్న సమయంలో ఈ సినిమా కథ కోసం చాలా సమయం వెచ్చించాల్సి వస్తోందట.

prabhas movie was cancelled because of this reason

prabhas movie was cancelled because of this reason

Prabhas Movie : ఫైటర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సిద్ధార్థ్

ప్రస్తుతం సిద్ధార్థ్ ఫైటర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకే సమయం మొత్తం కేటాయిస్తుండటంతో ప్రభాస్ సినిమాకు కథను సిద్ధంగా చేయడం సిద్ధార్థ్ కు కత్తి మీద సాము అవుతోంది. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడట సిద్ధార్థ్. మళ్లీ ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఈ కాంబోతో వస్తామని ఒక మాట అనుకున్నారట. ఏది ఏమైనా.. ప్రభాస్ ఖాతాలో చిరస్థాయిలో నిలిచిపోవాల్సిన ఒక గొప్ప సినిమా మాత్రం ఆగిపోయింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp