Prabhas Next Movie : ప్రభాస్ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా? నటీనటులు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 22 July 2023, 8:00 pm

Prabhas Next Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల్లో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు. చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న ప్రాజెక్ట్ కే కు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ కూడా విడుదలైంది. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా కూడా వస్తోంది. ఇక.. ప్రభాస్ హీరోగా మరో సినిమా కూడా రాబోతోంది. ఆ సినిమాకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు.

ప్రభాస్ నెక్స్ట్ సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో ఉండనుంది. హను రాఘవపూడి అనగానే మనకు గుర్తొచ్చే సినిమాలు ఏంటో తెలుసు కదా. అందాల రాక్షసి, సీతారామం లాంటి సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చినవే. ప్యూర్ లవ్ అండ్ క్లాసికల్ సినిమాలు తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇప్పుడు ఆయన ప్రభాస్ నటించే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఆయన చెప్పిన కథకు ప్రభాస్ కూడా ఓకే చెప్పేశారట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.వచ్చే డిసెంబర్ నుంచి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. అయితే.. సినిమా ఏ జానర్ లో రాబోతోంది అనే విషయం మాత్రం తెలియదు.

prabhas next movie confirmed with hanu raghavapudi directio

prabhas next movie confirmed with hanu raghavapudi directio

Prabhas Next Movie : డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్

అయితే.. ఈ సినిమాలో కూడా భారీ నటీనటులనే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో వేరే హీరోలు కూడా కొన్ని పాత్రలు చేస్తారని అంటున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియదు. ఈ సినిమా కూడా అన్ని భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp