Shyamala Devi : ఆర్ఆర్ఆర్ సినిమాకి అంత సీన్ ఉందా ?? ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కామెంట్స్ .. షాక్ లో తారక్ , చరణ్ !!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 March 2023,10:20 am

Shyamala Devi : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఈ సినిమా మంచి ఆదరణను పొందింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయింది. ఇటీవల ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చింది. దీంతో ఈ సినిమాకి కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా సభ్యులకు పలువురు స్టార్స్ విషెస్ చెబుతున్నారు.

Prabhas Peddamma Shyamala Devi Comments about RRR movie

Prabhas Peddamma Shyamala Devi Comments about RRR movie

ఈ క్రమంలోనే రీసెంట్గా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి చాలా యాక్టీవ్ గా ఉంటారు. సినిమా ఇండస్ట్రీలోనూ, బిజినెస్ లోను ఫ్యామిలీకి చాలా సపోర్ట్ చేస్తారు. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాకి వచ్చిన అవార్డ్స్ కి ఆమె స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనూ తన కొడుకులుగా భావించే తారక్, చరణ్ ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని,

అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ అవార్ గెలుచుకుంటుందని, నాకు చాలా నమ్మకం ఉందని గట్టిగా చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్ అందుకుంటే చూడాలని ఉంది అని, త్వరలోనే ఆ రోజు మన ముందుకు రాబోతుందని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ఇకపోతే హాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ సినిమాకి అంత సీన్ లేదు అని చెత్త కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు కొడుతుందో లేదో. ఇకపోతే ఆస్కార్ అవార్డులను మార్చి 12న ప్రకటించనున్నారు. ఈ క్రమంలోని పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఈ సినిమా యూనిట్ కు విషెస్ చెబుతున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి