Prabhas : లీక్ లీక్ లీక్ .. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా కి సంబంధించి భారీ మ్యాటర్ లీక్ అయ్యింది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : లీక్ లీక్ లీక్ .. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా కి సంబంధించి భారీ మ్యాటర్ లీక్ అయ్యింది !

Prabhas : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘ ప్రాజెక్ట్ కె ‘ సినిమా చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మూడో ప్రపంచ యుద్ధం లో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, హాట్ బ్యూటీస్ దీపిక పదుకొనే, దిశా పటానీలు నటిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 July 2023,5:00 pm

Prabhas : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘ ప్రాజెక్ట్ కె ‘ సినిమా చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మూడో ప్రపంచ యుద్ధం లో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్, హాట్ బ్యూటీస్ దీపిక పదుకొనే, దిశా పటానీలు నటిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో ఎంతమంది స్టార్స్ నటిస్తున్న కమలహాసన్ పాత్ర పై ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలని కోరికతో తహతహలాడే క్రూర స్వార్థపరుడిగా కమల్ హాసన్ నటించనున్నారని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలోని పాత్రలు ఇతిహాసంలోని పాత్రల స్ఫూర్తితో తీర్చిదిద్దారని ఇటీవలే చెప్పారు. అలా ప్రభాస్ పాత్ర కలియుగం ముగింపు సమయంలో చెడుని అంత చేయడానికి జన్మించబోయే కల్కి అని అంటున్నారు. అయితే ఇక్కడ అసలు కలియుగం ఎలా అంతమవుతుంది, ఎవరివల్ల అంతా అవుతుంది అనేది ఆసక్తికరం.

Prabhas project k movie update

Prabhas project k movie update

కలియుగ అంతానికి ఓ వ్యక్తి కారణమైతే అతడి పాత్ర ఎంత క్రూరంగా ఉండాలో డైరెక్టర్ డిజైన్ చేశారట. ఇప్పటికే కమలహాసన్ గత సినిమాతో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. అయితే అందులో హీరో పాత్రలు కూడా ఆయనే చేశారు కాబట్టి అది పూర్తిస్థాయిలో విలన్ అని చెప్పలేం. అయితే ప్రభాస్ సినిమాతో మాత్రం పూర్తిస్థాయిలో విలన్ గా కనిపిస్తాడని సమాచారం. ఏ పాత్రనైనా అలవోకగా చేయగలిగే కమల్ హాసన్ మొదటి సారి పూర్తిస్థాయిలో విలన్ పాత్ర చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది