Prabhas : ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నుంచి టీజర్ రెడీ అవుతోంది. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో ప్రభాస్ కి జంటగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ని యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు .. భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మోషన్ టీజర్ వచ్చినప్పటి నుంచి అందరిలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక రాధేశ్యామ్ నుంచి అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న టీజర్ ఈ నెల 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కాబోతోంది.
prabhas-radhae-shyam-teaser-highlights
గత కొన్ని రోజులుగా టీజర్ కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు రక రకాల కామెంట్స్ కూడా చేశారు. పైగా రాధేశ్యామ్ కథ గురించి ఎన్నో రకాల రూమర్స్.. గాసిప్స్ వచ్చి వైరల్ గాను మారాయి. అవన్ని మేకర్స్ చూస్తూ సైలెంట్ గా ఉన్నారు. ఇక న్యూ ఇయర్ కి రాధేశ్యామ్ టీజర్ వస్తుందనుకుంటే మేకర్స్ డిసప్పాయింట్ చేశారని ఫ్యాన్స్ హర్ట్ ట్రోల్ చేశారు. ఎన్ని ట్రోల్స్ చేసినా .. ఎవరు ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా దేనికి చిత్ర యూనిట్ రియాక్ట్ అవకుండా రాధేశ్యామ్ ని కంప్లీట్ చేసే పనిలో బిజిగా ఉన్నారు. ఎట్టకేలకి చిన్న షెడ్యూల్ మినహ దాదాపు టాకీపార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం.
కాగా త్వరలో రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ టీజర్ తో ఇన్నాళ్ళుగా వస్తున్న రూమర్స్ కి.. కామెంట్స్ కి చెక్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. జస్ట్ ప్రభాస్ లుక్ తోనే అందరికి సమాధానం దొరుకుందని అంటున్నారు. ఇక పూజా హెగ్డే ని ఎంతో అందంగా చూపించనున్నారట. కాగా ఈ టీజర్ రొమాంటిక్ యాంగిల్లో ఉంటుందని .. మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చే ఫీల్ గుడ్ రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం టీజర్ ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా రీసెంట్ గా ప్రీ టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ప్రభాస్ క్లాస్ లుక్ ని కాస్త రివీల్ చేశారు. కాగా త్వరలో రిలీజ్ కాబోతున్న టీజర్ లో రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.