
Prabhas : ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న ఫస్ట్ గ్లింస్ ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాధే శ్యామ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా.. పూజా హెగ్డే ప్రేరణ గా నటిస్తున్నారు. విక్రమాదిత్య – ప్రేరణల ప్రేమ ఎంతో పవిత్రమైందని తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ తో క్లారిటి ఇచ్చాడు దర్శకుడు రాధాకృష్ణ.
prabhas-radhe-shyam-first-glimpse-and release date on 30 julai announced by makers
యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ కలిసి 250 కోట్ల భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ ని నిర్మిస్తుండగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ లోనే లైలా మజ్ఞు, దేవదాసు పార్వతీ, సలీం అనార్కలీ లను చూపించి విక్రమాదిత్య – ప్రేరణల ప్రేమ కథ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు రాధకృష్ణ. ఇక తాజాగా రిలీజ్ చేసిన రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ కి జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో అద్భుతంగా ఉంది. విక్రమాదిత్య – ప్రేరణ ల లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇక తాజాగా వచ్చిన రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రాధే శ్యామ్ రిలీజ్ కాబోతోంది. ఇక హిందీ వెరషన్ కి మిథున్ మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 30 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తునట్టు అధికారకంగా వెల్లడించారు. కృష్ణం రాజు, భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్.. బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.