Ganta Srinivasa rao : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి మాదిరిగా తయారు అయ్యింది. ఈయన గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసి వైకాపా సునామీని కూడా తట్టుకుని నిల్చుని గెలిచాడు. తన ప్రాభవంను నిలుపుకున్న గంటా శ్రీనివాసరావు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గత ఏడాది కాలంగా వార్తలు వస్తున్నాయి. బీజేపీతో ఈయన క్లోజ్‌గా ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని కొన్నాళ్లు లేదు వైకాపాలో ఆయన జాయిన్ అవ్వబోతున్నాడు అంటూ మరి కొందరు వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకుని టీడీపీకి దూరం అవ్వడం అప్పుడప్పుడు మెల్ల మెల్లగా టీడీపీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం చేస్తూ ఉండేవాడు. ఆయన వ్యాఖ్యలను టీడీపీ ఇప్పటి వరకు చూసి చూడనట్లుగానే వదిలేసింది. అయితే ఇప్పుడు గంటా బీజేపీలో జాయిన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసింది. దాంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ కేంద్రంపై పోరాటంకు సిద్దం అయ్యాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తీవ్ర విమర్శలు చేయడంతో పాటు మరోసారి పెద్ద ఎత్తున విశాఖ ఉద్యమంకు ఊపిరి పోసి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేస్తానంటూ చాలా నమ్మకంగా బలంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో గంటా బీజేపీలో చేరడం అనేది సాధ్యం అయ్యే విషయం కాదు. ఇక ఆయనకు మిగిలి ఉన్న దారి వైకాపా అంటున్నారు. అయితే వైకాపాలోకి ఆయన్ను రానిచ్చేది లేదు అంటూ ఆ పార్టీ నాయకులు కొందరు బలంగా వైఎస్ జగన్ ను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటా ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది.
చంద్రబాబు నాయుడుతో గత కొన్ని నెలలుగా డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోవడంతో ఖచ్చితంగా ఆయన టీడీపీని వదలడం మాత్రం ఖాయం అని రాజకీయ వర్గాల వారు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో గంటా శ్రీనివాస్ మళ్లీ ఆయన వద్దకు వెళ్లి పార్టీలో ఉంటాను అని చెప్పలేని పరిస్థితి. అందుకే ఆయన ఖచ్చితంగా పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో గంటా ఏ పార్టీలో జాయిన్ అవుతాడు అనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం రెండు పార్టీలు కూడా ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కనుక మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ గంటా జనసేనలో జాయిన్ అవ్వడం. గంటా శ్రీనివాసరావుకు మెగా పార్టీ కొత్తేం కాదు. గతంలో చిరంజీవి పార్టీలో ఉన్న విషయం తెల్సిందే. ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ కు ఛాన్స్ ఉందని అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.